Nalleru Karam Podi: జలుబు దగ్గు, మోకాళ్ళ నొప్పులను మాయం చేసే నల్లేరు కారప్పొడి

Updated on: Oct 16, 2026 | 6:17 PM

గ్రామీణ ప్రాంతాల్లో పెరటి కంచెలపై, పొలాల గట్లపై కనిపించే 'నల్లేరు' సాధారణంగా చాలామందికి ఒక పిచ్చిమొక్కలా అనిపించవచ్చు. కానీ ప్రాచీన ఆయుర్వేదంలో దీనిని ఎముకలను దృఢపరిచేది అని పిలుస్తారు. విరిగిన ఎముకలు త్వరగా అతుక్కోవడానికి, ఆస్టియోపోరోసిస్ మరియు కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులతో నడవలేని వారికి ఇది దివ్యౌషధంలా పనిచేస్తుంది. అంతేకాకుండా శరీరంలోని వాతాన్ని హరించి, దీర్ఘకాలికంగా పీడిస్తున్న మొండి జలుబు, దగ్గు, కఫాన్ని నివారించడంలో నల్లేరు అత్యంత ప్రభావవంతమైనది. 

1 / 5
కావలసిన పదార్థాలు: 4 కప్పుల సన్నగా తరిగిన లేత నల్లేరు కాడలు, 2 కప్పుల ముదురు కరివేపాకు, 15 నుండి 20 ఎండు మిరపకాయలు, 2 టేబుల్ స్పూన్ల పచ్చి శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల పొట్టు మినప్పప్పు, 4 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టీస్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు, చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు,  1 టేబుల్ స్పూన్ జీలకర్ర,  5 నుండి 6 పొట్టు తీయని వెల్లుల్లి రెబ్బలు, 1  టేబుల్ స్పూన్ కల్లుప్పు, 1 టేబుల్ స్పూన్ వంట నూనె 

2 / 5
తయారీ విధానం: నల్లేరును తాకే ముందు చేతులకు కొద్దిగా వంట నూనె రాసుకోవాలి. దురద రాకుండా ఉండటానికి. కేవలం లేత కాడలను, లేత ఆకులను మాత్రమే ఎంచుకోవాలి. నీటితో శుభ్రంగా కడిగి తడి ఆరిన తర్వాత చిక్కుడుకాయల మాదిరిగా నారలు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్‌పై పాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ నూనె వేడిచేయాలి. నూనె కాగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, 1 టీస్పూన్ మెంతులు, 4 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసి లో ఫ్లేమ్‌పై వేయించాలి. పప్పులు సగం వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు వేసి చిటపటలాడే వరకు వేయించాలి.

3 / 5
ఆ తర్వాత 15-20 ఎండుమిరపకాయలు వేసి బొజ్జలు ఉబ్బే వరకు వేయించాలి. మిరపకాయలు వేగాక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు, 2 కప్పుల ముదురు కరివేపాకు వేసి కరివేపాకు క్రిస్పీగా మారే వరకు వేయించి మిక్సీ జార్‌లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. అదే పాన్‌లో మరో టేబుల్ స్పూన్ నూనె వేసి తరిగిన 4 కప్పుల నల్లేరు ముక్కలను వేయాలి. మంటను సిమ్‌లో ఉంచి 15 నుండి 20 నిమిషాల పాటు ఆపకుండా కలుపుతూ చాలా నిదానంగా వేయించాలి. ఇలా నూనెలో పూర్తిగా మెత్తబడి వేగకపోతే గొంతులో దురద వస్తుంది. నల్లేరు చక్కగా మెత్తబడ్డాక స్టవ్ ఆఫ్ చేసి, వేడి మీదే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర చల్లి మూతపెట్టాలి.

4 / 5
ముందుగా చల్లారిన పప్పులు-కరివేపాకు మిశ్రమానికి 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు చేర్చి మిక్సీలో మెత్తటి పౌడర్‌లా గ్రైండ్ చేసి వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్‌లో వేయించిన నల్లేరు-జీలకర్ర మిశ్రమం, 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసి ఒక్కసారి పల్స్ మోడ్‌లో తిప్పాలి. ఆ తర్వాత ముందుగా గ్రైండ్ చేసిన దినుసుల పొడిని కూడా ఇందులో వేసి మళ్లీ ఒకటికి రెండు సార్లు బాగా కలసిపోయేలా గ్రైండ్ చేయాలి.

5 / 5
నల్లేరులో ఉండే సహజ తేమ వల్ల పొడి కాస్త ముద్దగా అనిపిస్తుంది; కాబట్టి ఈ పొడిని ప్లేట్‌లోకి తీసుకుని ఫ్యాన్ కింద 10 నిమిషాలు ఆరబెట్టాలి. పూర్తిగా చల్లారి తేమ ఆరిన తర్వాత గాలి చొరబడని గాజు సీసాలో భద్రపరుచుకోవాలి. 2 నుండి 3 వారాల పాటు తాజాగా ఉంటుంది. అంతే, ఔషధ గుణాలు నిండిన సంప్రదాయ 'నల్లేరు కారప్పొడి' సిద్ధం! వేడివేడి ఆవిరి కుడుము, ఇడ్లీ, దోశలపై ఈ పొడి చల్లి, పూసపూస నెయ్యితో కలుపుకుని తిన్నా లేదా వేడి అన్నంలో మొదటి ముద్దగా తిన్నా కీళ్ల నొప్పులు తగ్గి ఒంటికి అమితమైన పుష్టి చేకూరుతుంది!

Loading...
Unable to load recommendations.
Follow Us