మల్బరీ పండ్లే కాదు.. వాటి ఆకుల్లో దాగున్న ఆరోగ్య రహస్యాలు తెలిస్తే అసలే వదిలిపెట్టరు!

Updated on: Jun 02, 2026 | 7:29 AM

వేసవి కాలంలో లభించే పండ్లలో మల్బరీ ఒకటి. నలుపు, ఎరుపు, తెలుపు రంగుల్లో లభించే ఈ పండ్లు పుల్లపుల్లగా, తీపిగా ఉంటూ తినడానికి ఎంతో రుచికరంగా ఉంటాయి. అయితే, కేవలం ఈ పండ్లు మాత్రమే కాకుండా, మల్బరీ చెట్టు ఆకులు కూడా ఆరోగ్యానికి ఒక సంజీవనిలా పనిచేస్తాయని మీకు తెలుసా? ఆయుర్వేదంలో చాలా కాలంగా వీటిని వివిధ రకాల ఆరోగ్య సమస్యల నివారణకు ఉపయోగిస్తున్నారు. మల్బరీ పండ్లలోని పోషకాలు, ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం...

1 / 5
మల్బరీ పండ్లతో పాటు వాటి ఆకులు కూడా ఆరోగ్యానికి అద్భుతమైన ఔషధంగా పనిచేస్తాయని ఆయుర్వేదం చెపుతోంది. ఈ పండ్లలో విటమిన్ సి, కె, ఎ, ఇ లతో పాటు క్యాల్షియం, ఐరన్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి, ఫ్రీ రాడికల్స్ నుండి శరీరాన్ని రక్షించడానికి తోడ్పడతాయి. అదేవిధంగా, మల్బరీ ఆకులలో ఉండే పోషకాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు..

2 / 5
ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచి, మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుంది. విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ఇమ్యూనిటీని పెంచి, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి. ఐరన్, విటమిన్లు రక్త ప్రసరణను మెరుగుపరచడంలో, రక్తహీనతను తగ్గించడంలో సహాయపడతాయి.

3 / 5
మల్బరీ పండ్లలో విటమిన్ సి, కె, ఎ, ఇ, ఫోలేట్ (విటమిన్ బి9) వంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే క్యాల్షియం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఫైబర్ వంటి ఖనిజ లవణాలు కూడా లభిస్తాయి. వీటితో పాటు ఆంథోసైనిన్స్, రెస్వెరాట్రాల్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు శరీరానికి అందుతాయి.

4 / 5
నిపుణుల అభిప్రాయం ప్రకారం, మల్బరీ ఆకులలో ప్రోటీన్లు, ఐరన్, క్యాల్షియం, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. చాలా మంది ఈ ఆకులను ఎండబెట్టి హెర్బల్ టీ, కషాయాలు లేదా హెర్బల్ పౌడర్ రూపంలో తీసుకుంటారు. మల్బరీ ఆకులలో ఉండే కొన్ని ప్రత్యేక సహజ సమ్మేళనాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా నియంత్రించడంలో అద్భుతంగా తోడ్పడతాయి.

5 / 5
శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (LDL) ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఈ ఆకులు సహాయపడతాయి. షుగర్ లేదా ఇతర ఆరోగ్య సమస్యల చికిత్స కోసం వీటిని తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవడం అవసరం. అయితే, మల్బరీ చెట్లు కేవలం ఆరోగ్యానికే కాకుండా, పట్టు పురుగుల (Silk worms) పెంపకానికి ప్రధాన ఆహారంగా ఉపయోగపడతాయి. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పట్టు పరిశ్రమ (Sericulture) ద్వారా ఎంతో మందికి ఉపాధి అవకాశాలను కూడా ఇవి కల్పిస్తున్నాయి.

Follow Us