
మనుషులైన.. జంతువులైన.. తల్లి ప్రేమ విషయంలో ఒకే తీరు ఉంటుంది. బిడ్డ కోసం.. ప్రతి తల్లి కూడా పరితపించిపోతుంది. ఇక బిడ్డ కనబడకపోతే.. ఆవేదన చెప్పడం ఎవరి వల్ల కాదు. ఇప్పుడు ఓ గేద కూడా బిడ్డ కనబడుతూనే పాలిస్తుంది.. దూరంగా చూస్తూ సంబరపడుతుంది.. అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం పెరిక పల్లి గ్రామానికి చెందిన చింతం వెంకటయ్య.. ఓ గేదని పెంచుకుంటున్నాడు.. ఇటీవల ఈ గీత ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ చిన్న గేద కొన్ని రోజులపాటు ఆరోగ్యంగా ఉంది.. ఎందుకు ఏమో కానీ.. అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో తల్లి..గేద తల్లడిల్లి పోయింది . అయితే బిడ్డ లేకపోవడంతో.. ఈ గేదె ఎవర్ని దగ్గరికి రానివ్వడం లేదు. బిడ్డ కోసం ఎదురుచూస్తుంది. రైతు కూడా ఏమీ అర్థం కాలేదు.. పాలు పితుకుదామంటే.. పొడవడానికి వస్తుంది. అప్పటికే చనిపోయిన చిన్న దూడ ను దూరంగా పెట్టారు.

ఇదే విషయాన్ని వెటర్నరీ డాక్టర్లకి చెప్పడంతో చిన్నపాటి ఉపాయం చెప్పాడు. అయితే చనిపోయిన చిన్న గెద.. చర్మంతో ఒక బొమ్మలు తయారు చేయాలని సూచించాడు. దీంతో చనిపోయిన.. ఆ చిన్న గేద తోలు తీసి.. ఆరబెట్టిన తర్వాత.. గేద బొమ్మగ తయారు చేశారు.. దీంతో.. ఈ గేదకు కొద్దిగా దూరంగా కట్టారు. ఈ బొమ్మ తన బిడ్డకు భావించి తినడం మొదలుపెట్టింది. అదేవిధంగా పాలు ఇచ్చేందుకు సహకరించింది . కొద్ది దూరంలో ఈ తోలు బొమ్మ.. మరికొద్ది దూరంలో గేదని కట్టేశారు. ఈ గేద తన బిడ్డ అనుకుంటూ.. పశుగ్రాసాన్ని తింటూ.. అటు ఇటు తిరుగుతుంది.

ఈ విధంగా తోలుబొమ్మ చేయడంతో.. పాలు కూడా ఇస్తుంది. ప్రతిరోజు ఉదయం రెండు గంటలు.. సాయంత్రం రెండు గంటలు ఈ తోలుబొమ్మను గీత ముందు పెడుతున్నారు రైతులు. ఇప్పుడు పశుగ్రాసం తినడంతో ఈ పెద్ద గేదె కూడా ఆరోగ్యంగా ఉంది. చిన్న గేదె చనిపోయిన నుంచి.. పశుగ్రాసం తినలేదని.. అదేవిధంగా పాలు పితకనివ్వలేదని రైతు చెప్తున్నారు . గేదలు బిడ్డ చనిపోతే ఆవేదనతో పశుగ్రాసం తినమని.. అదేవిధంగా పాలు కూడా ఇవ్వని వెటర్నరీ డాక్టర్ చెప్తున్నారు.

ఈ క్రమంలో ఈ ఆలోచనతోనే ఒక చిన్న బొమ్మ తయారు చేయడంతో గేద పశుగ్రాసంతోపాటు.. ఇప్పుడు పాలు ఇస్తుందని అంటున్నారు. ఒకవేళ ఈ విధంగా చేయకపోతే.. పెద్ద గేద.. ప్రాణానికే ప్రమాదం ఉండేదని తెలుపుతున్నారు. ఈ సమయంలో తిండితోపాటు పాలు పితకనివ్వకపోతే.. అనారోగ్య సమస్యలు వచ్చేవని అంటున్నారు. ప్రస్తుతం తోలుబొమ్మనే తన బిడ్డగా భావించి.. ఈ పెద్ద గేద ఇప్పుడు ఆనందంగా ఉంటుంది..