
కార్తీక మాసంలో చాలామంది నెలంతా పూజలు చేసుకుంటూ, శివుడిని మనస్ఫూర్తిగా కొలుస్తూ, పురాణాలు చదువుతూ ఉపవాసాలు చేస్తుంటారు. కొంతమంది కార్తీక సోమవారాల్లో మాత్రమే ఉపవాసం ఉంటే, మరికొంతమంది కార్తీక మాసం మొత్తం ప్రతిరోజూ పూజలు చేస్తూ ఉపవాసాలు చేస్తారు . అయితే, కొందరికి కొన్ని కారణాల వలన కార్తీక పౌర్ణమి రోజు దీపం పెట్టడం కుదరకపోవచ్చు. కార్తీక పౌర్ణమి రోజు దీపం పెట్టలేకపోయినవారు ఈ పవిత్రమైన రోజుల్లో పెట్టుకుంటే కోటి జన్మల పుణ్యం అని పండితులు చెబుతున్నారు.

కార్తీక పౌర్ణమి రోజు దీపం పెట్టడం కుదరకపోతే ఆ తరువాత వచ్చే మొదటి సోమవారం దీపం పెడితే చాలా మంచిదని అంటున్నారు. ఆ రోజున మీరు దీపం పెట్టాలి అనుకున్న వాళ్ళు ఉపవాసం ఉండి కింది చెప్పినా నియమాలు పాటిస్తే శివుని అనుగ్రహం పొందుతారు. అవేంటో ఇక్కడ చూద్దాం..

సూర్యోదయానికి ముందే స్నానం: సూర్యోదయానికి ముందే చన్నీటి స్నానం చేయడం ఎంతో పవిత్రంగా భావిస్తారు. స్నానం చేసిన తర్వాత పూజలకు సిద్ధం కావాలి. ఆ తరువాత తులసి కోట దగ్గర దీపారాధన చేయాలి. స్నానం చేసిన తర్వాత తులసి కోట దగ్గర దీపం వెలిగించి పూజ చేసుకోవాలి.

మీకు ఇష్టమైన దేవుడైన శివుడికి లేదా విష్ణుమూర్తికి భక్తిశ్రద్ధలతో పూజ చేసుకోవాలి. పూజలు, హారతులు పూర్తిచేసుకుని భగవంతుడిని ప్రార్ధించాలి ఉపవాస సమయంలో అన్ని తీసుకోకూడదు. ఉపవాసం చేసే సమయంలో శరీరానికి అవసరమైన నీటిని అందించాలి. మంచినీళ్లు, కొబ్బరినీళ్లు, మజ్జిగ, పండ్ల రసాలు వంటివి మాత్రమే తీసుకోవాలి.

పండ్లు తీసుకోవాలి: ఉపవాస సమయంలో శరీరానికి శక్తి అందించడం కోసం పండ్లను తీసుకోవడం మంచిది. మీ శరీరానికి సరిపడా పండ్లు తీసుకుంటూ ఉపవాసం కొనసాగించాలి. సాయంత్రం శివాలయానికి వెళ్లి 365 ఒత్తుల దీపం వెలిగించి ఉపవాసం విడిచి పెట్టాలి.