పప్పు మంచి టేస్ట్ ఉండాలి అంటే.. పోపు ఎలా పెట్టాలో తెలుసా?

Updated on: Jun 22, 2026 | 3:51 PM

పప్పు కర్రీ అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి. చాలా మంది ఎంతో ఇష్టంగా పప్పు కర్రీ చేసుకొని తింటారు. అయితే పప్పు కర్రీ మంచి రుచి రావాలి అంటే పోపు బాగుండాలి. పోపు ఎంత బాగా పెడితే పప్పు అంత రుచికరంగా ఉంటుంది. కాగా, అసలు పప్పు ఎలా పోపు పెట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1 / 5
చాలా మంది పప్పును ఉడకబెట్టి, తర్వాత కేవలం, ఆవాలు, జీలకర్ర , కరివేపాకు వేసి నార్మల్‌గా పప్పు పోపు వేస్తుంటారు. కానీ ఇలా వేయడం వలన పప్పు అంత రుచిని ఇవ్వదంట. దీనికంటూ ప్రత్యేకమైన పద్ధతి ఉంటుందంట. అది ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.

2 / 5
పప్పు కర్రీ వండటానికి  కావాల్సిన పదార్థాలు ఏవో చూసేద్దాం. పెసర పప్పు, కారం, ఉప్పు, ధనియాల పొడి, మెంతి పొడి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, పచ్చి మిర్చి, ఎండు మిర్చి, వెల్లుల్లి రెబ్బలు, అల్ల చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. మిరియాల పొడి. కస్తూరి మేతి కొంచెం. పసుపు.

3 / 5
అయితే పప్పు ఉడకబెట్టినా లేదా నార్మల్‌గా వండినా సరే పోపు అనేది సరిగ్గా పెట్టాలంట. దీని కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టాలి. అందులో సరిపడ నూనె వేయాలి. తర్వాత వాటిలో ఆవాలు, జీలకర్ర వేసి మంచిగా వేయించుకోవాలి. తర్వాత పచ్చి మిర్చి, ఎండు మిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి మంచిగా వేయించుకోవాలి.

4 / 5
తర్వాత ధనియాల పొడి, మెంతి పొడి, కరివేపాకు, కస్తూరి మేతి, పసుపు వేసుకోవాలి. మంచిగా వేయించుకోవాలి. తర్వాత ఇందులో చిన్న చిన్న అల్లం ముక్కలు వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వలన ఫ్లేవర్ చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత ఇందులో పప్పు వేసి మంచిగా మరగబెట్టుకోవాలి.

5 / 5
తర్వాత ఇందులో కారం, ఉప్పు వేసి మరగ బెట్టుకోవాలి. అంతే పప్పు రెడీ. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో పప్పు వేసుకొని, కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఆ రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. అంతే టేస్ట్ అదిరిపోతుంది. మరి మీరు కూడా ట్రై చేయండి

Follow Us