అరటి నారతో ఇక్కత్ వస్త్రం.. పోచంపల్లి నేతన్న వినూత్న ప్రయోగం

Edited By:

Updated on: Oct 13, 2026 | 5:09 PM

మగువలు మెచ్చే పట్టు చీరలకు నిలయం.. భారతదేశ సంస్కృతి సంప్రదాయాల ఔన్నత్యానికి ప్రతీక పోచంపల్లి చేనేత వస్త్రాలు. ఇక్కడి కళాకారులు నేసిన వస్త్రాలు అంతర్జాతీయ స్థాయిలో తళుకులీనుతున్నాయి. యంత్రాలు వేగంగా వస్త్రాలను తయారు చేస్తున్న ఆధునిక కాలంలోనూ.. తమ కళాత్మకతను జోడించి అద్భుతాలను సృష్టిస్తూ ప్రత్యేకతను చాటుతున్నారు.

1 / 5
తరతరాల కళకు.. సరికొత్త సాంకేతికత జోడింపు..  మగ్గంపై రంగుల ప్రపంచాన్ని ఆవిష్కరిస్తూ, వినూత్న ప్రయోగాలతో పోచంపల్లి ఇక్కత్ కళకు అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకువస్తున్న అద్భుత సృజనకారుడు బోగ బాలయ్య. యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లికి చెందిన ఈ చేనేత కళాకారుడు, తన ఇంటినే ఒక రీసెర్చ్ సెంటర్‌గా మార్చుకుని చేనేత రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్నారు. చేనేతలో కొత్తదనం తీసుకురావాలంటే ఖరీదైన యంత్రాలే ఉండాల్సిన అవసరం లేదు.. సృజనాత్మక ఆలోచన ఉంటే చాలు అని నిరూపిస్తున్నారు. సంప్రదాయ ఇక్కత్ డిజైన్లకు ఆధునిక ఆలోచనలను జోడిస్తూ.. ప్రకృతిలో లభించే ముడిసరుకుతో సరికొత్త వస్త్రాలను రూపొందిస్తున్నారు. సంప్రదాయ నేత పద్ధతులను కాపాడుకుంటూనే.. అందుబాటులో ఉన్న సహజ వనరులతో కొత్త ఉత్పత్తులను సృష్టించవచ్చని చాటిచెబుతున్నారు.

2 / 5
అరటి నారతో ఇక్కత్ వస్త్రం..సాధారణంగా అరటి పంట తర్వాత పనికిరాదని భావించే అరటి మొక్క నుంచి లభించే నారను వస్త్ర తయారీలో వినియోగించాలనే ఆలోచనతో కొత్త ప్రయత్నానికి భోగ బాలయ్య శ్రీకారం చుట్టారు. సాధారణంగా కాటన్, సిల్క్ వస్త్రాలను నేయడానికి కుడి, ఎడమ ఉండే రెండు పెడల్స్ తొక్కుతూ మగ్గంపై వస్త్రాన్ని వస్త్రాన్ని నేస్తారు. కానీ, ఈ విధానంలో మాత్రం ప్రత్యేకంగా నాలుగు పెడల్స్, నాలుగు అచ్చులను వినియోగించారు. అడ్డం దారం (వెస్ట్) మాత్రం అరటి చెట్టు కాండం పొరల నార నుంచి తీసిన దారాన్ని, నిలుపు (వార్పు) 2/120 నెంబర్ కాటన్ దారాన్ని వినియోగించి ఇక్కత్ డిజైన్లో వస్తాన్ని రూపొందించారు. అరటి నార దారాన్ని కోయంబత్తూర్ నుంచి తెప్పించారు. అరటి, కాటన్ దారాల మిశ్రమంతో తయారైన వస్త్రం ముడత పడదని, ఒకవైపు కాంతివంతమైన రంగు కలిగి, చాలా మృదువుగా ఉంటుందని బాలయ్య తెలిపారు.

3 / 5
పర్యావరణహిత ఆలోచన..వస్త్రాల తయారీలో పర్యావరణహితమైన రంగులను వినియోగించడం వల్ల శరీరానికి చల్లదనం, చమటను పీల్చే గుణం వల్ల ఆహ్లాదాన్ని ఇస్తుందని వెల్లడించారు. అందుకే అరటి నారను వినియోగించామని నేత కళాకారుడు బాలయ్య చెప్పారు. మొదటి ప్రయత్నంగా వస్త్రాన్ని తయారు చేయడానికి నెల రోజుల సమయం పట్టిందన్నారు.

4 / 5
ఎన్నో అద్భుతాలను సృష్టించిన బాలయ్య..గతంలో బాలయ్య.. చేనేత ఇక్కత్ వస్త్రాన్ని పదివేల రంగుల షేడ్స్‌తో మగ్గంపై నేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. శాలువాపై పదివేల రంగుల డిజైన్లతో ఇండియా మ్యాప్‌ను ఆవిష్కరించి అందరినీ అబ్బుర పరిచి, తన సృజనాత్మకతతో ‘సంత కబీర్‌’ పురస్కారాన్ని పొందారు. అద్భుతమైన వస్త్ర కళాఖండాలను రూపొందించిన బాలయ్య అనేక అవార్డులు పురస్కారాలను పొందారు.

5 / 5
 పోచంపల్లి నేతన్న చేస్తున్న ప్రయోగం చేనేత రంగానికి కొత్త దారులు చూపించే అవకాశముంది. ఇలాంటి వినూత్న ఉత్పత్తులకు మార్కెట్‌లో ఆదరణ లభిస్తే.. సంప్రదాయ చేనేతకు కొత్త గుర్తింపు రావడంతో పాటు, ప్రకృతి ఆధారిత వస్త్రాల తయారీకి కూడా ప్రోత్సాహం లభించవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us