Rain Alert: రాగల 24 గంటల్లో మరో అల్పపీడనం.. ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు

|

Sep 24, 2024 | 8:28 AM

సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ. ఎత్తులో ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగల 24 గంటలలో పశ్చిమ, మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

1 / 5
సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ. ఎత్తులో ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగల 24 గంటలలో పశ్చిమ, మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దాని ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

2 / 5
 ఇవాళ, రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు, కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే చాన్స్‌ ఉంది. తెలంగాణలోని 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ప్రకటించిన వాతావరణ శాఖ ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది.

3 / 5
 అలాగే.. ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని వెల్లడించింది వాతావరణ శాఖ. ప్రధానంగా.. ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

4 / 5
 మరోవైపు గత రెండు రోజుల నుంచి రాత్రైతే చాలు వరుణుడు విరుచుకుపడుతున్నాడు. సాయంత్రం తర్వాత ఒక్కసారిగా వెదర్‌ ఛేంజ్‌ అయి వర్షం పడుతోంది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టు ఒకట్రెండు గంటలు భారీ వర్షం పడుతోంది.

5 / 5
సోమవారం సాయంత్రం సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలతోపాటు మలక్ పేట, దిల్ షుఖ్ నగర్, కాచిగూడ, సైదాబాద్, చాదర్ ఘాట్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే టైం కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్‌ అయింది.  దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.