Lemon Pepper Rasam Rice: అన్నం కూర ఎందుకు దండగ.. 20 నిమిషాల్లో తయారయ్యే ఈ రెసిపీ ఉండగా

Updated on: May 20, 2026 | 6:40 PM

వేసవి కాలం వచ్చిందంటే చాలు వంటగదిలోకి వెళ్లాలంటేనే అందరికీ ఒక రకమైన బద్ధకం, చిరాకు వచ్చేస్తుంటాయి. ఆ ఉక్కపోతలో గంటల తరబడి నిలబడి అన్నం, కూర, చారు విడివిడిగా వండటం చాలా కష్టమైన పని. అలాంటప్పుడు తక్కువ సమయంలో, తేలికగా అయిపోయే వంటకాల వైపు మన మనసు మళ్ళుతుంది. అలాంటి వారికి ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం 'లెమన్ పెప్పర్ రసం రైస్'.

1 / 5
లెమన్ పెప్పర్ రసం రైస్ కేవలం 20 నిమిషాల్లోనే ఎంతో రుచికరంగా తయారైపోయే ఈ వంటకం, వేసవిలో కడుపుకు ఎంతో హాయిని ఇస్తుంది. లంచ్ బాక్స్‌లోకి ఏది పంపాలో తెలియనప్పుడు కూడా ఈ రెసిపీ బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ దీనిని ఎంతో ఇష్టంగా తింటారు. ఈ సింపుల్ అండ్ డెలిషియస్ రసం రైస్‌ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

2 / 5
ఈ వంటకం కోసం ముందుగా ఒక కప్పు బియ్యంలో పావు కప్పు కందిపప్పు (లేదా పెసరపప్పు) వేసి శుభ్రంగా కడిగి, ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. పప్పు చక్కగా నానితేనే అన్నం మెత్తగా ఉడుకుతుంది. ఆ తర్వాత ఒక కుక్కర్‌లో నానిన బియ్యం, పప్పు వేసి అందులో మూడు కప్పుల నీళ్లు, అర చెంచా పసుపు, రెండు కట్ చేసిన టమోటా ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్‌లో నాలుగు ఐదు విజిల్స్ రానివ్వాలి.

3 / 5
అన్నం ఉడికేలోగా ఒక బాణలిలో అర టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక టీస్పూన్ జీలకర్ర, రెండు ఎండుమిర్చి వేసి లో ఫ్లేమ్‌లో దోరగా వేయించాలి. ఇవి కాస్త చిటపటలాడాక దించి, కచ్చాపచ్చాగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ ప్రెజర్ పోయాక అన్నాన్ని పప్పు గుత్తితో మెత్తగా ఎనుపుకోవాలి. ఇక తాలింపు కోసం ఒక కడాయిలో నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేయాలి. నెయ్యి వేడెక్కాక గుప్పెడు జీడిపప్పులు వేసి ఎర్రగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే నెయ్యిలో ఒక టీస్పూన్ ఆవాలు, ఎండుమిర్చి వేసి వేయించాలి.

4 / 5
ఎండుమిర్చి కాస్త నల్లబడే వరకు వేగితేనే తాలింపు మంచి సువాసనతో ఉంటుంది. ఆ తర్వాత కరివేపాకు, దంచిన వెల్లుల్లి రెమ్మలు, కొద్దిగా ఇంగువ వేసి బాగా వేపాలి. ఈ గుమగుమలాడే తాలింపులో ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసి, అందులోనే ఒక 600 ఎమ్ఎల్ వేడి నీళ్లను పోయాలి. వేడి నీళ్లు పోయడం వల్ల అన్నం గట్టిపడకుండా జారుగా ఉంటుంది. ఇందులో ఒక టేబుల్ స్పూన్ రసం పొడి (నీళ్లలో కలిపినది), రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కొత్తిమీర మరియు మనం ముందుగా నూరుకున్న మిరియాల పొడి వేసి బాగా కలపాలి.

5 / 5
ఈ మిశ్రమాన్ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి, మూత ఉంచి ఒక 10 నుండి 12 నిమిషాల పాటు నిదానంగా ఉడకనివ్వాలి. అన్నం నిదానంగా ఉడికితేనే రసం ఫ్లేవర్స్ అన్నీ దానికి బాగా పడతాయి. పప్పు జారుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి, చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర, ఒకటిన్నర నిమ్మకాయ రసాన్ని పిండి బాగా కలుపుకోవాలి. సర్వ్ చేసే ముందు పైన వేయించిన జీడిపప్పులను వేసుకుంటే ఎంతో రుచికరమైన లెమన్ పెప్పర్ రసం రైస్ సిద్ధమవుతుంది. దీనికి సైడ్ డిష్‌గా అప్పడాలు, చిప్స్ లేదా కారాబూంది నంచుకుని తింటే ఆ రుచే వేరు. ఎండకాలంలో సులువుగా చేసుకోగలిగే ఈ కమ్మని వంటకాన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.

Follow Us