Red Banana Health Benefits: ఈ పండు రోజుకొకటి తింటే చాలు.. మీ గుండెకు శ్రీరామ రక్ష..!!

Updated on: Apr 22, 2025 | 2:20 PM

మీరు పసుపు, ఆకుపచ్చ అరటిపండ్లు ఎక్కువగా తింటూ ఉంటారు. వాటి ప్రయోజనాల గురించి కూడా మనందరికీ తెలుసు. కానీ మీరు ఎప్పుడైనా ఎర్ర అరటిపండు తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి విన్నారా..? లేకపోతే, ఎర్ర అరటిపండు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తప్పక తెలుసుకోండి...ఈ పండ్లు రోజూ తింటే.. రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది, జీర్ణక్రియకు ప్రయోజనం చేకూరుతుంది. మరిన్ని లాభాలు ఏంటంటే...

1 / 5
ఎర్ర అరటిపండులో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా తీసుకోవచ్చు. ఇందులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో, గుండె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడంలో సహాయపడుతుంది.

2 / 5
ఎర్ర అరటిపండ్లలో విటమిన్ సి, బీటా కెరోటిన్ ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో చాలా సహాయపడతాయి. ఇది అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం, ఆమ్లత్వం,  జీర్ణక్రియకు సంబంధించిన అనేక సమస్యలకు ఉపశమనం ఇస్తుంది. ఎర్ర అరటిపండు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, భారతదేశంలోని అనేక ప్రాంతాలలో పండుతుంది.

3 / 5
ఎర్రటి అరటి పండులో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. పొటాషియం.. హైపర్‌టెన్షన్‌ను కంట్రోల్‌లో ఉంచుతుంది. ఎర్రటి అరటి పండులో.. మెగ్నీషియం కూడా మెండుగా ఉంటుంది. ఇది అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పొటాషియ, మెగ్నీషియం గుండెపోటులు, స్ట్రోకులు, గుండె సమస్యలను దూరం చేస్తాయి.

4 / 5
ఎర్ర అరటిపండ్లు తినడం వల్ల చర్మం ఎర్రబడటం, పొడిబారడం, దద్దుర్లు, సోరియాసిస్ వంటి అనేక చర్మ సమస్యలను నయం చేస్తుంది.  చలికాలంలో చర్మం పగలడం కూడా తగ్గుతుంది.. కాబట్టి మీరు ఏదైనా చర్మ సమస్యతో బాధపడుతుంటే ఎర్రటి అరటిపండు తినవచ్చునని నిపుణులు చెబుతున్నారు.

5 / 5
ఎర్రటి అరటిపండ్లలో లుటీన్, బీటా కెరోటిన్ అనే రెండు కెరోటినాయిడ్లు ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పసుపు అరటి పండుతో పోలిస్తే.. దీనిలో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది. బీటా కెరోటిన్ మన శరీరంలో విటమిన్‌ ఏ గా మారుతుంది. ఇది కంటి ఆరోగ్యానికి అవసరమైన పోషకం.

Loading...
Unable to load recommendations.
Follow Us