
నిజానికి మన ఇళ్లలో తిరిగే సాధారణ బల్లులు విషపూరితమైనవి కావు. బల్లి కాటు సాధారణంగా ప్రాణాంతకం కాదు. కానీ వాటి నోటిలో ఉండే బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంది. బల్లి కరిచినప్పుడు ఆ బ్యాక్టీరియా చర్మంలోకి ప్రవేశించి కొన్ని ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

లక్షణాలు ఎలా ఉంటాయి? : బల్లి కరిచినప్పుడు ప్రభావిత ప్రాంతంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రమైన నొప్పి, మంట, దురద, వాపు రావడం, శరీరం ఇన్ఫెక్షన్‌కు గురైతే వికారం, వాంతులు, జ్వరం వంటి సమస్యలు వస్తాయి.

హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం, జంతువులు, కీటకాలు మనకు కనిపించే విధానాన్ని బట్టి కొన్ని శకునాలు ఉంటాయని నమ్ముతారు. శకున శాస్త్రం ప్రకారం, ఉదయం నిద్రలేవగానే గోడపై ఉన్న బల్లిని చూడటం చాలా మంచిది. ఇది మీరు చేపట్టబోయే పనుల్లో విజయం లభిస్తుందని చెప్పడానికి ఒక సూచన.

lizard

నిద్రలేవగానే బల్లి కనిపిస్తే అకస్మాత్తుగా ధన లాభం కలిగే అవకాశం ఉందని నమ్ముతారు. బల్లి గోడపై కింది నుండి పైకి పాకుతూ కనిపిస్తే, అది మీ ఉద్యోగంలో ప్రమోషన్ లేదా వ్యాపారంలో లాభాలకు సంకేతం. పురాణాల ప్రకారం బల్లిని లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావిస్తారు. అందుకే కొన్ని ప్రాంతాల్లో బల్లి కనిపిస్తే నమస్కరించుకునే ఆచారం కూడా ఉంది.