
బ్రైట్‌నెస్, హెవీ టాస్క్‌లు: ఫుల్ స్క్రీన్ బ్రైట్‌నెస్ పెట్టడం, నిరంతరాయంగా 5G నెట్‌వర్క్ వాడటం, 4K వీడియో రికార్డింగ్ లేదా హై గ్రాఫిక్స్ గేమింగ్ ఆడటం వల్ల ప్రాసెసర్‌పై విపరీతమైన భారం పడుతుంది. ఎండ రోజుల్లో బ్రైట్‌నెస్‌ను తక్కువగా ఉంచండి. ఎక్కువ సేపు ఫోన్ వాడినప్పుడు మధ్యమధ్యలో ఫోన్‌కు కొంత విశ్రాంతి ఇవ్వండి. అంతేకాకుండా ఎండ తగిలేలా ఫోన్ అస్సలు పెట్టకూడదు.

ఛార్జింగ్ పెడుతూ గేమింగ్: మొబైల్ ఓవర్‌హీట్ అవ్వడానికి ఇదే అతిపెద్ద కారణం. ఛార్జింగ్ అయ్యేటప్పుడు బ్యాటరీ సహజంగానే కొద్దిగా వేడెక్కుతుంది. దీనికి తోడు మీరు హెవీ గేమ్స్ ఆడితే ప్రాసెసర్ రెండింతలు వేడెక్కుతుంది. ఈ రెండు పనులు ఒకేసారి చేయడం వల్ల ఫోన్ పేలిపోయే ప్రమాదం కూడా ఉంది. అంతేకాకుండా మార్కెట్‌లో లభించే మందపాటి, స్టైలిష్ ప్లాస్టిక్ లేదా లెదర్ కవర్లు ఫోన్ లోపల ఉత్పత్తి అయ్యే వేడి బయటకు వెళ్లకుండా అడ్డుకుంటాయి. అందుకే ఫోన్ వేడిగా అనిపిస్తే.. వెంటనే బ్యాక్ కవర్‌ను తీసేయండి. ఇది ఫోన్ త్వరగా చల్లబడటానికి హెల్ప్ అవుతుంది.

చాలా మంది తమ ఫోన్ బాగా వేడెక్కినప్పుడు, దానిని త్వరగా చల్లబరచడానికి ఫ్రిజ్‌లో లేదా ఫ్రీజర్‌లో పెట్టే తీవ్రమైన తప్పు చేస్తుంటారు. ఇలా అస్సలు చేయకూడదు.. ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పు కారణంగా, ఫోన్ లోపల తేమ పేరుకుపోతుంది. ఇది నేరుగా మదర్‌బోర్డ్‌ను షార్ట్ సర్క్యూట్ చేసి, ఫోన్‌ను శాశ్వతంగా పనికిరాకుండా చేస్తుంది. ఫోన్‌ను ఎల్లప్పుడూ ఫ్యాన్ కింద లేదా గాలి ఆడే ప్రదేశంలో సహజంగానే చల్లారనివ్వండి.

బ్యాక్‌గ్రౌండ్ యాప్స్: ఫోన్ వేడెక్కడానికి బయటి వాతావరణమే కాదు, అంతర్గత సాఫ్ట్‌వేర్ కూడా కారణమే. బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూ, అనవసరంగా ర్యామ్, ప్రాసెసర్‌ను వాడేసే యాప్‌లను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉండండి. అదేవిధంగా పాత సాఫ్ట్‌వేర్ లేదా యాప్‌లలో ఉండే బగ్స్ కారణంగా ప్రాసెసర్‌పై అనవసరమైన లోడ్ పడి ఫోన్ వేడెక్కుతుంది. మొబైల్ కంపెనీలు ఈ హీటింగ్ సమస్యలను పరిష్కరించడానికి తరచుగా సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తుంటాయి. కాబట్టి ఫోన్‌ను ఎల్లప్పుడూ లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోండి.

నాణ్యత లేని లేదా చౌకైన లోకల్ ఛార్జర్లు, కేబుళ్లను ఉపయోగించడం వల్ల మొబైల్ చాలా త్వరగా హీట్ ఎక్కుతుంది. ఎల్లప్పుడూ మీ మొబైల్ బ్రాండ్‌కు చెందిన ఒరిజినల్ లేదా సర్టిఫైడ్ ఛార్జర్లనే వాడండి. ఎందుకంటే ఇవి విద్యుత్ సరఫరాతో పాటు ఉష్ణోగ్రతను కూడా నియంత్రించేలా డిజైన్ చేయబడతాయి. ఈ చిన్న చిన్న చిట్కాలను పాటించడం ద్వారా మీ స్మార్ట్‌ఫోన్ వేడెక్కకుండా కాపాడుకోవడమే కాకుండా దాని బ్యాటరీ లైఫ్‌ను, ఫోన్ జీవితకాలాన్ని రెండింతలు పెంచుకోవచ్చు. స్మార్ట్‌గా ఉండండి.. మీ స్మార్ట్‌ఫోన్‌ను సేఫ్‌గా ఉంచుకోండి..