
మార్కెట్‌లో ప్రస్తుతం అనేక రకాల బ్రాండ్‌లలో ఖర్జూరాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో కల్తీలేని ఖర్జూరాలను గుర్తించి కొనుక్కోవడం ముఖ్యం.సహజ ఖర్జూరాలు ఎప్పుడూ కాస్త పొడి చర్మంతో, లేత లేదా ముదురు గోధుమ రంగులో ఉంటాయి. బయటి భాగం విపరీతంగా మెరుస్తూ, మందపాటి పొట్టులో ఉంటే అవి కల్తీవని గుర్తించండి. ఎందుకంటే వాటిపై బరువు పెంచడానికి గ్లూకోజ్ సిరప్, షుగర్ సిరప్ లేదా పారాఫిన్ వ్యాక్స్ వంటికి వాడి ఉంటారు.

మీరు టేస్ట్‌ను బట్టి కూడా సహజమైన ఖర్జూరాలను గుర్తించవచ్చు. సహజమైన ఈతపండ్లలో ఆహ్లాదకరమైన, సాధారణ తీపి, మంచి సువాసన ఉంటాయి. అలా కాకుండా నోట్లో వేసుకోగానే వెంటనే గొంతుకు కొట్టొచ్చినట్లు విపరీతమైన తీపి అనిపిస్తే, వాటిని పంచదార పాకంలో లేదా కృత్రిమ తీపి ద్రావణంలో ముంచారని అర్థం చేసుకోవాలి. అలాంటి వాటిని అస్సలు కొనకండి.

సహజంగా పండిన ఖర్జూరాల చర్మంపై చిన్న చిన్న ముడతలు ఉంటాయి. దాన్ని పట్టుకున్న వెంటనే అది సహజమైనదా.. నకిలీదా అనేది మనకు అర్థమైపోతుంది. ఈతపండును మీరు చేతిలోకి తీసుకున్నప్పుడు అది విపరీతంగా అంటుకుంటుంటే, దానికి షుగర్ సిరప్ కలిపారని గ్రహించాలి. అలాంటి కృత్రిమ రసాయనాలతో చేసిన వాడికి దూరంగా ఉండడమే బెస్ట్.

తెరిచి ఉంచిన అసలైన మంచి ఖర్జూరాల వైపు ఈగలు, పురుగులు త్వరగా ఆకర్షించబడతాయి. అదే కెమికల్స్ లేదా వ్యాక్స్ రాసిన నకిలీ ఖర్జూరాలపై కీటకాలు వాలవు. అలాంటి వాటిని మీరు కొనకపోవడమే మంచిది. అలాగే సహజమైన ఖర్జూరాన్ని నమిలినప్పుడు దాని గుజ్జు గింజ నుండి చాలా సులభంగా వేరుపడుతుంది. ఒక వేళ అది రాకపోయినా.. బిగుతుగా అనిపించినా అవాడిపోయిందని అర్థం.

కాబట్టి ఈ సారి ఖర్చూరాలను కొనడానికి వెళ్లినప్పుడు.. ఈ విషయాలను కచ్చితంగా గుర్తుంచుకొని కొనండి. లేదంటే కేవలం డబ్బు మాత్రమే.. కాదు మీరు ఆరోగ్యాన్ని కూడా కోల్పోయే అవకాశాలు లేకపోలేవు.( Note: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా మాత్రమే అందించబడినవి.. వీటిని Tv9 దృవీకరించడం లేదు)