
బేకింగ్ సోడా: టాయిలెట్ దుర్వాసనను పొగొట్టడంలో బేకింగ్ సోడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని ఎలా వాడాలంటే.. ముందుగా ఒక చిన్న గిన్నెలో బేకింగ్ సోడా నింపి, టాయిలెట్‌లోని ఏదైనా ఒక మూలలో పెట్టండి. కావాలనుకుంటే ఇందులో కొన్ని చుక్కల నిమ్మరసం కూడా కలపవచ్చు. ఇది గాలిలోని దుర్వాసనను నెమ్మదిగా తగ్గించి, బాత్‌రూమ్‌ను ఫ్రెష్‌గా ఉంచుతుంది.

డ్రైన్ శుభ్రత: చాలాసార్లు వాసన టాయిలెట్ సీట్ నుండి కాకుండా, నీళ్లు పోయే డ్రైన్ పైప్ నుండి కూడా వస్తుంది. కాబట్టి మీరు వారానికి కనీసం ఒక్కసారైనా డ్రైన్ రంధ్రంలో కొంచెం ఉప్పు, డిటర్జెంట్ వేసి, ఆపై పైనుంచి వేడి నీళ్లను పోయండి. ఇలా చేయడం వల్ల అందులో పేరుకుపోయిన మురికి వదిలిపోయి, బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. అలాగే మీ బాత్‌రూమ్ కూడా ఫ్రెష్‌గా ఉంటుంది.

వెనిగర్ స్ప్రే: తెల్ల వెనిగర్ కూడా క్లీనింగ్‌లో చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని బాత్‌రూమ్‌లో ఎలా వాడాలంటే.. ముందుగా సగం నీరు, సగం వెనిగర్ కలిపి ఒక స్ప్రే బాటిల్‌లో పోసుకోండి. ఈ మిశ్రమాన్ని టాయిలెట్ సీట్, సింక్, బాత్‌రూమ్ మూలల్లో స్ప్రే చేయండి. ఇది దుర్వాసనను పోగొట్టడమే కాకుండా, క్రిములను చంపి మరింత బాగా శుభ్రం చేస్తుంది. దీంతో మీరు ప్రత్యేకంగా ఎయిర్ ప్రెషనర్స్ అవసరం లేకుండానే బాత్‌రూమ్‌లో మంచి స్మెల్ వస్తుంది.

నిమ్మకాయ తొక్కలు: చాలా మంది నిమ్మకాయలను వాడిన తర్వాత వాటి తొక్కలను తీసి పడేస్తుంటారు. కానీ వీటిని వాడి బాత్‌రూమ్‌లో దుర్వాసనను పోగొట్టవచ్చని చాలా మందికి తెలియదు. ఇందుకోస మీరు నిమ్మకాయ తొక్కలను ఒక చిన్న ప్లేట్‌లో పెట్టి టాయిలెట్ వైపు ఎక్కడైనా ఉంచవచ్చు. అంతేకాకుండా, ఈ తొక్కలను నీళ్లలో బాగా ఉడికించి, ఆ నీటితో బాత్‌రూమ్ ఫ్లోర్ లేదా మూలలను తుడవడం వల్ల మంచి సువాసన వస్తుంది. అలాగే వీటిలోని తాజా సిట్రస్ వాసన బాత్‌రూమ్‌ను ఫ్రెష్‌గా ఉంచుతుంది.

టాయిలెట్ పేపర్ రోల్ : ఒకవేళ మీ ఇంట్లో ఎసెన్షియల్ ఆయిల్ ఉంటే, దాని నుండి కొన్ని చుక్కలను టాయిలెట్ పేపర్ రోల్ లోపల ఉండే కార్డ్‌బోర్డ్ భాగంపై వేయండి. దీనివల్ల పేపర్ రోల్‌ను ఉపయోగించిన ప్రతిసారీ తేలికపాటి సువాసన వ్యాపించి, బాత్‌రూమ్ అంతా గాల్లో మంచి సువాసన వస్తుంది. అయితే బాత్‌రూమ్‌లో తేమ ఎక్కువగా ఉన్నా లేదా గాలి సరిగ్గా ఆడకపోయినా దుర్వాసన మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటుంది. అందుకే శుభ్రం చేయడంతో పాటు ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఆన్ చేయడం, కిటికీలు తెరిచి ఉంచడం చాలా ముఖ్యం.