పళ్లు తోముకునేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి.. లైట్ తీసుకుంటే తిప్పలు తప్పవు..

Updated on: Nov 27, 2025 | 7:02 AM

మన దైనందిన జీవితంలో సరైన సమయంలో ఆహారం తినడం, నిద్రపోవడంపై మనం ఎక్కువ ఫోకస్ పెడతాం. కానీ, మన దంతాలను ఎలా తోముకుంటున్నాం అనే దానిపై మాత్రం పెద్దగా పట్టించుకోం. చాలామంది బలంగా రుద్దితేనే పళ్ళు శుభ్రపడతాయని అనుకుంటారు. కానీ ఈ విధానం ఆరోగ్యానికి ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. డాక్టర్ జనని జయపాల్ ప్రకారం.. బలంగా పళ్లు తోముకోవడం తప్పు. ఇలా బలంగా రుద్దడం వల్ల చిగుళ్లు దెబ్బతిని రక్తం కారడం జరగవచ్చు. దంతాలు శుభ్రపడటానికి బలం కాదు, సరైన పద్ధతి ముఖ్యం. దీనికి సంబంధించి ఆమె కొన్ని కీలక చిట్కాలను వెల్లడించారు.

1 / 5
మీరు ఎడమ చేతివాటం వారైతే, కుడి చేతితో బ్రష్ చేయండి. మీరు కుడి చేతివాటం వారైతే, ఎడమ చేతితో బ్రష్ చేయండి. ఇలా చేయడం వల్ల బలం తగ్గుతుంది. దంతాలకు గాయం కాదు. అదేవిధంగా టూత్ బ్రష్ హ్యాండిల్‌ను కేవలం 3 వేళ్లతో మాత్రమే పట్టుకోండి. మొత్తం చేయి ఉపయోగించడం వల్ల ఎక్కువ బలం పడుతుంది, అది చిగుళ్లను గీరుతుంది.

2 / 5
ఫ్లెక్సిబుల్ బ్రష్: ఫ్లెక్సిబుల్ టూత్ బ్రష్ వాడటం వల్ల కూడా బలం తగ్గుతుంది. మీరు ఎంత బలం ఉపయోగిస్తున్నారో తెలియాలంటే, ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ ఉపయోగించడం మంచిది.

3 / 5
 సరైన బ్రషింగ్ విధానం: దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే, రోజుకు రెండుసార్లు పళ్లు తోముకోవడంతో పాటు కొన్ని పద్ధతులు పాటించాలి. టూత్ బ్రష్‌ను దంతాలకు 45 డిగ్రీల కోణంలో పట్టుకోవాలి.చిగుళ్ల వైపు నుండి మెల్లగా కదిలిస్తూ రుద్దాలి. కనీసం 2 నిమిషాలు పాటు పళ్లు తోముకోవాలి.

4 / 5
చాలామందికి తిన్న వెంటనే పళ్లు తోముకునే అలవాటు ఉంటుంది. అయితే ఏదైనా తిన్న తర్వాత లేదా ఏదైనా తాగిన తర్వాత కనీసం 30 నిమిషాల వరకు పళ్లు తోముకోవడం మానేయాలి. ఎందుకంటే ఈ సమయంలో ఎనామిల్ బలహీనంగా ఉంటుంది. వెంటనే బ్రష్ చేయడం వలన అది దెబ్బతినవచ్చు. తిన్న 30 నిమిషాల తర్వాత పుష్కలంగా నీరు త్రాగడం మీ దంతాలకు మంచిది.

5 / 5
బ్రేక్‌ఫాస్ట్ తినడానికి ముందే పళ్లు తోముకోవడం చాలా ముఖ్యం. పళ్లు తోముకున్న వెంటనే నీటితో బాగా పుక్కిలించకూడదు. ఎందుకంటే దంతాలను రక్షించే ఫ్లోరైడ్ తడిచిపెట్టుకపోతుంది.  దంతాల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఈ చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.