Fish Stripes: చేపలపై ఉండే చారలు, మచ్చల వెనుక ఉన్న రహస్యాలివే.. ఆధ్యాయనాల్లో వెల్లడైన ఆసక్తికర విషయాలు..

|

May 12, 2023 | 3:03 PM

సముద్రం, నది, చెరువు లేదా అక్వేరియంలో కనిపించే అనేక రకాల చేపలపై కొన్ని చారలు, మచ్చలు ఉంటాయి. నిజానికి ఈ మచ్చలు, చారల వల్ల చేపలు చాలా అందంగా కనిపిస్తాయి. అయితే ఆ చేపలలో అవి ఎందుకు ఉంటాయి, ఎలా ఏర్పడ్డాయని ఎప్పుడైనా ఆలోచించారా..? ఒకే జాతి చేపలలో కూడా పరిమాణం, ఆకృతి, రంగులో చాలా తేడా ఉంటుంది. దీని వెనుక ఏదైనా శాస్త్రీయ కారణం ఉందా లేక ఈ చారలు, మచ్చలు ఇలా వస్తాయోననే విషయాలపై అనేక పరిశోధనలు జరిగాయి. ఈ అధ్యయానాల ద్వారా అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 6

2 / 6
మాలిక్యులర్ బయాలజీ సహాయంతో చేపలలో ఈ వ్యత్యాసం ఎందుకు సంభవిస్తుందో అనే వివరాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అన్నింటిలో మొదటిగా శాస్త్రవేత్తలు సిచ్లిడ్ చేపలపై పరిశోధన ప్రారంభించారు.  దీనికి ప్రత్యేక కారణం కూడా ఉంది. అదేమిటంటే.. ఈ చేపల జాతి 500 కంటే ఎక్కువ ఉపజాతులను అభివృద్ధి చేసింది. ఇంకా ఈ ఉపజాతులన్నీ కూడా ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి.

3 / 6
దక్షిణాఫ్రికాలోని విక్టోరియా సరస్సులో సిచ్లిడ్‌ చేపల ఉపజాతులు ఎక్కువగా కనిపిస్తాయి. శాస్త్రవేత్తలు ఈ చేపలను వాటి పూర్వీకులతో అనుసంధానించడం ద్వారా మాలిక్యులర్ బయాలజీ ద్వారా పరిశోధనను ముందుకు తీసుకువెళుతున్నారు. విక్టోరియా సరస్సులో ఈ చేపల ప్రాణాలకు ముప్పు తెచ్చే అనేక జీవులు ఉన్నాయని కూడా శాస్త్రవేత్తలు తమ అధ్యయనాల ద్వారా తెలిపారు. అయితే సిచ్లిడ్ చేపలు విక్టోరియా సరస్సులోని ప్రమాదకరమైన జీవుల ఆధారంగా జీవించే కళను అభివృద్ధి చేశాయి.

4 / 6
శరీరంపై నిలువు చారలు ఉన్న చేపలు నీటి మొక్కలతో దాక్కుంటాయని, బహిరంగ నీటిలో నివసించే చేపలు సమాంతర చారలను కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు తమ పరిశోధనలతో  తెలుసుకున్నారు. ఈ సమాంతర చారల సహాయంతోనే చేపలు తమను వేటాడే జంతువుల నుంచి  రక్షించుకుంటాయని కూడా వారు వెల్లడించారు.

5 / 6
జర్మనీలోని కాన్‌స్టాన్స్‌కు చెందిన పరిణామాత్మక జీవశాస్త్రవేత్త ఒకరు ఈ సిచ్లిడ్ జాతి చేపలపై పరిశోధనలు చేశారు. DW ఇచ్చిన నివేదిక ప్రకారం సిచ్లిడ్ జాతుల నిలువు చారలు కలిగిన మగ చేపలు, సమాంతర చారలు కలిగిన ఆడ చేపలను కలిసి ఉంచారు. అయితే వీటికి పుట్టిన పిల్లల్లో దేనికీ అడ్డంగా చారలు లేకపోవడాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. ఆ తరువాత కొన్ని మగ చేపలు, ఆడపిల్లలను ఒక సమూహంలో ఉంచారు. అప్పుడు ఈ పిల్లలలో నాలుగింట ఒక వంతులో సమాంతర చారలు కనుగొన్నారు. తద్వారా చేపలకు వారి తల్లిదండ్రుల జన్యువుల నుంచి ద్వారా కూడా చారలు వచ్చాయని కనుగొన్నారు.

6 / 6
వివిధ జంపింగ్ జన్యువుల వల్ల ఈ చేపలకు రంగు వస్తుందని కూడా ఆధ్యయానాల్లో వెల్లడైంది. ఈ చేపలు పుట్టినప్పుడు ముదురు రంగులో ఉంటాయని, తరువాత జంపింగ్ జన్యువు సహాయంతో అవి నారింజ, పసుపు లేదా తెలుపు రంగులోకి మారుతాయని తెలుసుకున్నారు. చేపల చర్మంలో మెనాలినిన్ అనే కణాలు చనిపోవడం ప్రారంభించినప్పుడు ఈ చేపలు బంగారు రంగులోకి మారుతాయని, ఇందుకు కూడా జంపింగ్ జన్యువు  సహాయపడుతుందని వెల్లడించారు.