ఒక్క గ్లాసు మీ జీవితాన్ని మార్చగలదు.. ఉదయాన్నే మీ రోజును ఇలా ప్రారంభిస్తే.. ఒంట్లో వ్యాధులన్నీ పరార్..!

Updated on: May 29, 2025 | 7:19 AM

చాలా మంది ఉదయం నిద్రలేవగానే గోరువెచ్చని నీళ్లు తాగుతారు. ఈ అలవాటు చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే కాస్త వేడి నీటిని తాగడం వల్ల శరీరంలో అనేక మార్పులు జరుగుతాయని అంటున్నారు. నిజంగానే ఇలా పరగడుపునే గోరువెచ్చటి నీళ్లు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
ఉదయం నిద్ర లేవగానే ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగడం వల్ల మీ కడుపు పూర్తిగా శుభ్రపడుతుంది. ఉదయం గోరువెచ్చని నీరు త్రాగడం వల్ల జీర్ణవ్యవస్థకు చాలా మేలు జరుగుతుంది. ఇది అసిడిటీ వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఖాళీ కడుపుతో వేడి నీళ్లు తాగడం వల్ల రక్తనాళాలు చురుగ్గా మారి శరీరమంతటా రక్త సరఫరా వేగవంతమవుతుందని నిపుణులు అంటున్నారు. దీంతో శరీర భాగాల పనితీరు మరింత మెరుగుపడుతుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటుంది.

2 / 5
గోరు వెచ్చని నీళ్లు జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తుంది. పేగు కండరాలను సడలించి, ప్రేగు కదలికలను సులభతరం చేస్తుంది. ఇది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. శరీరం నిర్విషీకరణకు సహాయపడుతుంది. గోరువెచ్చని నీరు శరీరం నుండి విషాన్ని బయటకు పంపడంలో సహాయపడుతుంది.

3 / 5
చల్లటి నీళ్ల కంటే వేడి నీళ్లు ఆహారం తొందరగా జీర్ణం అయ్యేలా చేస్తాయని తెలిపారు. ఇంకా వేడి నీళ్లు శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయని.. ఫలితంగా జీర్ణప్రక్రియ ఆరోగ్యంగా మారి అధిక కేలరీలను ఖర్చు చేస్తాయని వివరించారు. ఇదే కాకుండా కడుపు నిండిన భావనను కలిగించి.. ఆహారం తీసుకునే మోతాదును తగ్గిస్తాయన్నారు.

4 / 5
శరీరం లోపలి నుండి శుభ్రపరచబడుతుంది. చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. ఉదయాన్నే వేడి నీళ్లు తీసుకోవడం వల్ల శరీరాన్ని హైడ్రేట్రెడ్​గా ఉంచుతుంది. దీంతో ముఖంపై మొటిమలు, ముడతలను తగ్గించి చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది. కొంతమంది దీనికి నిమ్మకాయ, తేనె కలుపుకుని తాగుతారు.

5 / 5
వేడి నీరు రక్త నాళాలను విస్తరిస్తుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది గుండె ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. గుండె కండరాలపై ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు రక్తపోటును నియంత్రిస్తుంది. బరువు తగ్గాలనుకుంటే గోరువెచ్చని నీరు సహాయపడుతుంది. కేలరీలు వేగంగా ఖర్చవుతాయి. సైనస్ సమస్యకు చెక్ పెడుతుంది.