
ప్రోటీన్ పౌడర్ తయారీ కోసం కావాల్సిన పదార్థాలు : బాదం పప్పు కప్పు, గుమ్మడి గింజలు కప్పున్నర, ఓట్స్ కప్పున్నర, అవిసె గింజలు, జీలకర్ర పొడి, యాలకుల పొడి, ఎండు ఖర్జూర, జీడిపప్పు, పొద్దుతిరుగుడు విత్తనాలు, సోయా చంక్స్, పల్లీలు కప్పు, మఖానా, పుట్నాలు కప్పు.

ఇప్పుడు తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా స్టవ్ ఆన్ చేయాలి. పెద్ద పాన్ పెట్టాలి. తర్వాత అందులో పల్లీలు, బాదం, జీడి పప్పులు, ఓట్స్ అన్నీ ఒకదాని తర్వాత మరొకటి విడివిడిగా వేయించుకోవాలి. బంగారు రంగులో మాడకుండా, మంచిగా వేయించి పక్కన పెట్టుకోవాలి.

ఇవన్నీ బాగా వేగి, చల్లారిన తర్వాత మిక్సీజార్ తీసుకొని, అందులో వీటిని వేసి మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకటికి రెండు సార్లు వీటిని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఈ పౌడర్ మొత్తాన్ని, జల్లించుకోవాలి. తర్వాత సాఫ్ట్‌గా ఉన్న పౌడర్ వస్తుంది. దీనిని గాలి చొరబడని బాక్సులో వేసి, నిలువ చేసుకోవాలి. అంతే ప్రోటీన్ పౌడర్ రెడీ.

బయట కొనుగోలు చేసే పని లేకుండా చాలా సులభంగా దీనిని ఇంటిలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ చాలా మంది ఇలా చేయకుండా ఎక్కువ మొత్తంలో డబ్బులు పెట్టి కొనుగోలు చేస్తుంటారు. కానీ బయటకొనుగోలు చేసిన దానికంటే ఇలా మనం ఇంటిలో రెడీ చేసుకున్న పౌడర్‌లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందంట.

ఇక దీనిని ప్రతి రోజూ గ్లాస్ పాలలో తీసుకోవడం చాలా మంచిది. అంతే కాకుండా దీనిలో రాగి పిండి కూడా యాడ్ చేసి ప్రతి రోజూ పిల్లలకు ఇవ్వడం వలన బరువు పెరుగుతారు. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఈ పౌడర్ కండరాలను బలపరిచి ఎముకలు ధృఢంగా ఉండేలా చేస్తుంది.