ఒత్తిడిలేని జీవితం కోసం అద్భుతమైన టిప్స్ ఇవే!

Updated on: Jun 27, 2025 | 7:20 PM

ఈ ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది ఒత్తిడితో తమ జీవితాన్ని గడిపేస్తున్నారు. నిజమైన మనశ్శాంతి దొరకడం అనేది ఈరోజుల్లో కరువైపోయిందనే చెప్పాలి. చాలా మంది ఎన్ని సమస్యలు ఉన్నా, ఎలాంటి ఒత్తిడి లేకుండా బతకడానికి చాలా ప్రయత్నిస్తుంటారు. కానీ కుదరదు. అయితే ఒత్తిడి లేని జీవితం గడపాలంటే తప్పకుండా కొన్ని టిప్స్ పాటించాలంట. అవి ఏవి అంట?

1 / 5
శ్వాస మీదే ధ్యాస .. ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని కళ్లు మూసుకొని, ధ్యానం చేస్తూ, ముక్కు ద్వారా నెమ్మదిగా గాలిని పీల్చుకుంటూ, తర్వాత దాన్ని మెల్లగా వదలండి. ఇలా మీరు శ్వాసపైనే ధ్యాసను కేంద్రీకరించి, ప్రతి రోజూ ఒక 10 నిమిషాలు ఇలా చేయడం ద్వారా ఒత్తిడి నుంచి విముక్తి కలుగుతుందంట. అంతే కాకుండా ఇది మనసుకు హాయినివ్వడమే కాకుండా, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదంట.

2 / 5
ఒక వ్యక్తి పలికే ప్రతి పదానికి శక్తి ఉంటుంది అని అంటుంటారు. అంతే కాకుండా అవి పలికే సమయంలో వచ్చే శబ్ధం మనసుకు కొన్ని సార్లు హాయినిస్తుందంట. అయితే మీరు మీకు ఇష్టమైన లేదా మీ   హృదయాన్ని తాకే మంత్రం లేదా పేరును, ఉదాహరణకు“ఓం శాంతి,” “రాధే-రాధే,” లేదా మీరు ఎంచుకున్న దేవత పేరు కావచ్చు. దానిని మీ కళ్లు మూసుకొని సున్నితంగా మెల్లిగా లేదా బిగ్గరగా జపిస్తూ ధ్యానం చేయండి. మీ ధ్యాస మొత్తం మీరు పలికే పదం లేదా ఇష్టదైవంపై పెట్టడం వలన ఇది మీకు మంచి ఆరోగ్యాన్ని ఒత్తిడి లేదని జీవితాన్ని ఇస్తుందంట.

3 / 5
మీ జీవితంలో మీకు చాలా ఇష్టమైన వ్యక్తి ఎవరో గుర్తించి, మీరు చాలా ఒత్తిడికి గురయ్యారు అనిపించినప్పుడు  వారికి కాల్ చేసి ఒంటరిగా మాట్లాడండి. దీని వలన మీ మనసుకు సంతోషం కలగడమే కాకుండా, అది మిమ్మల్ని ఒత్తిడి నుంచి దూరం చేస్తుంది. చిన్న నాటి జ్ఞాపకాలను గుర్తు చేసి మీ మదిలో ఉండే బాధను మీకు లేకుండా చేస్తుంది. అందుకే ఒత్తిడి నుంచి బయటపడటానికి ఇది బెస్ట్ ఆప్షన్.

4 / 5
ఖాళీగా ఒంటరిగా కూర్చొవడం అస్సలే మంచిది కాదు. అందుకే అధిక ఒత్తిడితో బాధపడే వారు ఎప్పుడూ ఖాళీగా లేదా ఒంటరిగా ఉండకూడదంట. అయితే ఇలాంటి వారు పచ్చటి ప్రకృతి మధ్య ఆనందంగా నడవాలి. మీకు ఇష్టమైన పార్కు లేదా ప్లేస్‌కి వెళ్లి కాసేపు వాకింగ్ చేయడం వలన ఒత్తిడి నుంచి బయటపడుతారు.

5 / 5
ఇక ఒత్తిడితో బాధపడే వారు తమకు ఇష్టమైనది చేయడం, పెయింటింగ్ లేదా ఇష్టమైన గేమ్స్ ఆడటం లాంటిది చేయాలంట. దీని వలన ఇది ఫిజికల్‌గా ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా,మానసికంగా కూడా మిమ్మల్ని దృఢపరిచి, ఒత్తిడి నుంచి బయటపడేలా చేస్తుందంట. అందుకే ఒత్తిడితో బాధపడే వారు ఆటలు ఆడటం అనేది ఉత్తమం.