
మనం ఇప్పటి వరకు ఎన్నో రకాల వంటలు చేసుకుని తింటాము, అయితే, వాటిలో కొన్ని ఆరోగ్యానికి మంచివి. మన ఆరోగ్యమే కాకుండా పిల్లల హెల్త్ కూడా చాలా ముఖ్యం. పిల్లల కంటిచూపుకు మేలు చేసే రుచికరమైన పొన్నగంటి కారప్పొడి.. ఇలా చేసుకుని తింటే ఈజీగా నెల పైనే నిల్వ ఉంటుంది. మరి, ఇంకెందుకు లేట్ దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం..

కావాల్సిన పదార్థాలు: మూడు కప్పులు పొన్నగంటి ఆకులు , అర కప్పు శనగపప్పు, పావు కప్పు మినపప్పు రెండు టేబుల్ స్పూన్స్ ధనియాలు , ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, 8 ఎండుమిర్చి , 4 వెల్లుల్లి రెబ్బలు , కొద్దిగా చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, రెండు టేబుల్ సూన్స్ నూనెను తీసుకోవాలి.

పొన్నగంటి ఆకులను తీసుకుని మూడు సార్లు బాగా కడిగి ఆరనివ్వాలి. ఆ తరవాత పాన్‌లో ఆయిల్ వేసి పొన్నగంటి ఆకులు కూడా వేసి వేయించాలి. ఆ తరువాత కొద్దిసేపు చల్లారనివ్వాలి. అదే పాన్‌లో శనగపప్పు, ధనియాలు, జీలకర్రను వేసి సువాసన వచ్చే వరకు వేయించాలి.

చివర్లో నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వేయించాలి. ఇప్పుడు రోటిలో కొద్దిగా చింతపండు, ఉప్పు వేసి వాటిని మెత్తగా పొడి చేసుకోవాలి. పొన్నగంటి ఆకులు కూడా వేసి మళ్లీ పొడిపొడిగా చేసుకోవాలి. చల్లారిన తర్వాత ఒక చిన్న పప్పు డబ్బాలో నిల్వ చేసుకోవాలి.

అయితే, మీరు ఈ ఆకు తినేటప్పుడు వైద్యున్ని సంప్రదించి తినడం మంచిది. ఎందుకంటే, కొందరికి ఇది పడొచ్చు కొందరికి పడకపోవచ్చు . (నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.)