Gastric Problem: గ్యాస్ట్రిక్ సమస్యలతో సతమతం అవుతున్నారా? ఈ ఆసనాలతో సమస్య పరార్..

|

Sep 04, 2022 | 8:52 PM

Gastric Problem: ప్రస్తుత ఉరుకులు, పరుగుల జీవితంలో జనాలు ఎప్పుడు తింటున్నారో, ఎప్పుడు నిద్రపోతున్నారో కూడా తెలియని పరిస్థితి ఉంది. సరైన తిండి లేక, సమయానికి నిద్ర లేకపోవడంతో..

1 / 5
Gastric Problem: ప్రస్తుత ఉరుకులు, పరుగుల జీవితంలో జనాలు ఎప్పుడు తింటున్నారో, ఎప్పుడు నిద్రపోతున్నారో కూడా తెలియని పరిస్థితి ఉంది. సరైన తిండి లేక, సమయానికి నిద్ర లేకపోవడంతో.. జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయి. చాలా మంది కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రిక్ సమస్యలతో సతమతం అవుతున్నారు. ఈ సమస్యలను అధిగమించేందుకు మెడిసిన్స్‌పై ఎక్కువ ఆధారపడుతున్నారు. అయితే, యోగా నిపుణుల ప్రకారం.. కొన్ని యోగాసనాలు గ్యాస్ట్రిక్ సమస్యకు పూర్తిగా చెక్ పెడతాయంటున్నారు. మరి ఆ యోగాసనాలేంటో ఇప్పుడు చూద్దాం..

2 / 5
పశ్చిమోత్తనాసనం: ఈ ఆసనం జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి బయటపడటానికి సహాయపడుతుంది.

3 / 5
హలాసనం: కండరాలను దృఢంగా మారుస్తుంది. ఈ ఆసనం జీర్ణక్రియకు సంబంధించిన అనేక సమస్యల నుండి రక్షిస్తుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్ధకం సమస్యను అధిగమించడానికి సహాయపడుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యల నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది.

4 / 5
బాలసనా: ఈ భంగిమ చాలా సులభం. ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది. అనేక ఆరోగ్య సమస్యలను నయం చేయడంలో సహాయపడుతుంది. బాలసనా జీర్ణక్రియకు సంబంధించిన సమస్యల నుండి ఉపశమనం పొందడమే కాకుండా వెన్నునొప్పి, ఆందోళన, ఒత్తిడిని తగ్గిస్తుంది.

5 / 5
ఆనంద బాలసనా: ఈ ఆసనాన్ని హ్యాపీ చైల్డ్ పోజ్ అని కూడా అంటారు. ఈ ఆసనం గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి పనిచేస్తుంది. ఆనందబాలసన జీర్ణ వ్యవస్థ, గ్యాస్ట్రిక్ సమస్యల నుండి ఉపశమనం పొందేందుకు దోహదపడుతుంది. వెన్నునొప్పిని కూడా తగ్గిస్తుంది.