నెల రోజుల పాటు వేడి నీటిలో అల్లం వేసి తాగితే ఏమవుతుందో తెలుసా..? ఇలాంటి వ్యాధులన్నీ పరార్..

|

Jan 01, 2025 | 3:26 PM

శీతాకాలంలో అల్లం ఆరోగ్యానికి వరంలాంది అంటారు. ఇందులో శరీరానికి మేలు చేసే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. వేడి నీటిలో అల్లం వేసుకొని తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేదం చెబుతోంది. అయితే, ఒక నెలరోజుల పాటు అల్లం నీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
అల్లం ఒక సహజమైన ఔషధం, ఇది శతాబ్దాలుగా వివిధ ఆరోగ్య సమస్యలకు చికిత్సగా ఉపయోగించబడుతోంది. అల్లంలో యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉండటంతో ఒక నెలపాటు ప్రతిరోజూ అల్లం నీటిని తాగడం వల్ల రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. అల్లంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి.

2 / 5
యాంటీ-ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్న అల్లం నీటిని ఒక నెల పాటు తీసుకోవడం వల్ల ఈజీగా బరువు తగ్గవచ్చు. ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే జీవక్రియలు మొదలవుతాయి. ఊబకాయం తగ్గుతుంది. ఆకలి కూడా తగ్గుతుంది. రోజంతా ఎక్కువగా తినడం వంటి సమస్యలని దూరం చేస్తుంది. దీంతో త్వరగా బరువు తగ్గుతారు.

3 / 5
నెల రోజుల పాటు అల్లం నీరు తాగితే అజీర్ణం, కడుపు ఉబ్బరం, వికారం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు.. అల్లం నీటిని తాగడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని గణనీయంగా తగ్గిస్తుంది. దీని వల్ల మీ గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

4 / 5
అల్లం నీటిలో ఉండే జింజెరాల్, షోగోల్ వంటి సమ్మేళనాలు ఆర్థరైటిస్, గుండె జబ్బులతో సహా తాపజనక సమస్యలను నివారించడంలో సహాయపడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే అల్లం నీరు చర్మ సంబంధిత సమస్యల నుండి రక్షించడంలో దివ్యౌషధంగా పనిచేస్తుంది.

5 / 5
అల్లం నీరు తాగడం వల్ల మలబద్ధకం, అతిసారం, గ్యాస్ వంటి సమస్యలను తగ్గించవచ్చు. అల్లం నీరు వాంతులు, వికారాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అల్లం నీటిలో మెంతులు లేదా పుదీనాతో కలిపి తాగవచ్చు.