
సెప్టెంబర్ 26న ఆకాశంలో అద్భుతం చోటు చేసుకోనుంది. ఈ రోజున హార్వెస్ట్ మూన్ తన వెలుగులు ప్రకాశింపజేయనుంది. అసలు హార్వెస్ట్ మూన్ అంటే ఏంటి? అనుకుంటున్నారా? అయితే ఇప్పుడు మనం దీని గురించి వివరంగా తెలుసుకుందాం పదండి.

సంవత్సరంలో చంద్రుడు ఒకసారి శరదృతువు కు చాలా దగ్గరగా వస్తాడు. ఆ మూన్‌ను హర్వెస్ట్ మూన్ అంటారు. అయితే 2026లో సెప్టెంబర్ 26న ఆకాశంలో హార్వెస్ట్ మూన్ దర్శనం ఇవ్వనున్నదంట. అయితే దీనికి హార్వెస్ట్ అనే పేరు రావడానికి ఒక కారణం ఉన్నదంట. అది ఏమిటి అంటే? శరదృతువుకు చంద్రుడు దగ్గరగా వచ్చినప్పుడు ఈ మూన్ ఏర్పడుతుంది. అయితే ఈ సమయంలో చంద్రుడు ఎక్కువగా ప్రకాశిస్తుంటాడు.

అయితే పాతకాలంలో రైతులు ఈ వెన్నెల వెలుగుల్లోనే రాత్రి వరకు పొలాల్లో ఉండి, పని చేసేవారు. అందుకే దీనికి హార్వెస్ట్ మూన్ అనే పేరు వచ్చింది. ఇక దీనిని ఆధ్యాత్మిక పరంగా పూర్వీకులను స్మరించుకునే సమయం అని కూడా చెబుతుంటారు. చాలా వరకు ఈ హార్వెస్ట్ మూన్ అనేది సెప్టెంబర్, అక్టోబర్ నెలలో సంభవిస్తుంటుంది.

ఈ సంవత్సరంలో ది ఓల్డ్ ఫార్మర్స్ అల్మానాక్ ప్రకారం, హార్వెస్ట్ మూన్ సెప్టెంబర్ 26,2026 న EDT మధ్యాహ్నం 12:49 గంటలకు గరిష్ట ప్రకాశాన్ని చేరుకుంటుంది. అమెరికాలో ఈ గరిష్ట ప్రకాశం పగటిపూట సంభవిస్తుంది . భారత్‌లో మీరు దీనిని సెప్టెంబర్ 25, 26 తేదీలలో సాయంత్రం పూట చూడవచ్చు. ఈ సమయంలో చంద్రుడు చాలా ప్రకాశవంతంగా కనిపిస్తాడు. అంతే కాకుండా ఒక రోజు మాత్రమే కాకుండా రెండు మూడు రోజుల పాటు చంద్రు ప్రకాశవంతంగా కనిపిస్తాడు.

ఆధ్యాత్మికంగా కూడా ఈ పౌర్ణమి చాలా ప్రత్యేకతను, ప్రాముఖ్యతను సంతరించుకుంటుందని చెబుతున్నారు పండితులు. ఈరోజున భూమిపై శక్తులు అధికం అవుతాయంట. దీని వలన ఈ రోజు ధ్యానం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. అంతే కాకుండా ఈ పౌర్ణమి ఆధ్యాత్మిక సాధనకు చాలా ప్రత్యేకమైనదంట. ఈరోజు మీ దృష్టిని ఆధ్యాత్మికతవైపు మళ్లించడం చాలా మంచిదని చెబుతున్నారు పండితులు.