Skincare Tips: ఇలా చేశారంటే తలతల మెరిసే చర్మం మీ సొంతం.. ఆ సమస్యలన్నీ పరార్..

Updated on: Aug 05, 2023 | 6:27 PM

Glowing Skin: మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది పలు రకాల చర్మ సమస్యలతో బాధ పడుతున్నారు. ఇక ఈ చర్మ సమస్యల కోసం మార్కెట్‌లో లభించే ప్రతి కాస్మటిక్‌ని ఆశ్రయిస్తుంటారు. కానీ ఫలితాలు సరిగ్గా లేకపోగ సైడ్ ఎఫ్పెక్ట్స్‌తో బాధపడుతుంటారు. అయితే చర్మ సమస్యల నివారణతో పాటు మెరిసే చర్మం కోసం ఖర్చు లేని హోమ్ రెమెడీస్‌ని సూచిస్తున్నారు పలువురు డెర్మటాలజిస్టులు. మరి అవేమిటో ఇప్పుడు చూద్దాం..

1 / 5
Glowing Skin: మెరిసే చర్మాన్ని కోరుకోనివారు ఎవరుంటారు..? అయితే అంతకంటే ముందు ఇప్పటికే ఉన్న చర్మ సమస్యలను కూడా వదిలించుకోవాలి కదా.. ఆ క్రమంలోనే చర్మ సమస్యలను నివారించడంతో పాటు మెరిసే చర్మానికి మేలు చేసే కొన్ని ఇంటి చిట్కాలు ఉన్నాయి. వాటిని పాటిస్తే చాలు, అన్ని రకాల చర్మ సమస్యలు తొలగిపోయి మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది.

2 / 5
పోషకాహారం: సంపూర్ణమైన ఆరోగ్యం కావాలంటే మనం తీసుకునే ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉండేలా చూసుకోవాలి. పోషకాలతో కూడిన ఆహారం మన ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు చర్మానికి కూడా మేలు చేస్తుంది. చర్మానికి కావాలసిన విటమిన్లు, నియాసిన్, బయోటిన్ వంటివి ఆహారం ద్వారానే లభిస్తాయి కనుక మెరుగైన పోషకాహారం తీసుకోండి.

3 / 5
తగినంత నీరు: మెరిసే చర్మాన్ని కోరుకునేవారు చేయవలసిన మరో పని తగినంత నీరు తీసుకోవడం. ఈ క్రమంలో మీరు ప్రతి రోజు కనీసం 2 లీటర్లు నీరు తీసుకోవాలి. జీవక్రియలతో పాము ముఖం తేమగా ఉండాలంటే శరీరంలో నీరు తప్పనిసరిగా ఉండాలి.

4 / 5
సన్‌స్క్రీన్: ఎండలోకి వెళ్లే సమయంలో సన్‌స్క్రీన్ వాడడం కూడా తప్పనిసరి. లేకపోతే సూర్యుని కిరణాలు నేరుగా మన చర్మంపై పడి.. స్కిన్ అలెర్జీలతో పాటు చర్మం వాడిపోయేలా చేస్తుంది. అందువల్ల చర్మానికి సూర్యుని నుంచి రక్షణ కవచంగా సన్‌స్క్రీన్‌ని ఉపయోగించండి.

5 / 5
ఫేస్ మసాజ్: ముఖంలో రక్త ప్రసరణ సరిగ్గా లేకపోతే చర్మం వాడిపోయినట్లుగా పొడిగా ఉంటుంది. ఈ క్రమంలో మీరు ముఖంపై మీ చేతులతో నెమ్మదిగా మసాజ్ చేసుకోవాలి. అలా చేయడం ద్వారా ముఖంలో కూడా రక్త ప్రసరణ సవ్యంగా జరిగి మీ ముఖం మెరిసిపోతుంది.