అందానికి, జుట్టుకు సూపర్‌ఫుడ్.. ఆడవారి ఆరోగ్యానికి ఈ గింజలు వరం లాంటివి..

Updated on: Oct 13, 2026 | 1:13 PM

ఆడవారు శారీరక, మానసిక సమస్యలు ఎదుర్కొంటారు. అవిసె గింజలు వారికి ఎంతో మేలు చేస్తాయి. బరువు తగ్గడం, హార్మోన్ల సమతుల్యత, క్రమమైన పీరియడ్స్, మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్ నివారణకు తోడ్పడతాయి. ఎముకలు, కండరాలను బలోపేతం చేసి, జుట్టు, చర్మ ఆరోగ్యానికీ మేలు చేస్తాయి.

1 / 5
మహిళలు తమ జీవితంలో శారీరకంగా, మానసికంగా అనేక సవాళ్లను ఎదుర్కొంటూ ఉంటారు. ఈ సమస్యలను అధిగమించి ఆరోగ్యంగా ఉండాలంటే సరైన పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అటువంటి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలలో అవిసె గింజలు (Flax Seeds) ఒకటి.. అవిసె గింజలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మహిళలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

2 / 5
ముఖ్యంగా, అవిసె గింజలు బరువు తగ్గడంలో ఎంతగానో సహాయపడతాయి. వీటిలో ఉండే ప్రోటీన్, ఫైబర్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీఆక్సిడెంట్లు జీవక్రియ రేటును పెంచి, బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తాయి. అంతేకాకుండా, అవిసె గింజలు ఆడవారిలో హార్మోన్లను సమతుల్యం చేస్తాయి. నెలసరి సమస్యలను తగ్గించి, పీరియడ్స్ సక్రమంగా వచ్చేలా దోహదపడతాయి.

3 / 5
మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా అవిసె గింజలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి ఎముకలు, కండరాలను బలంగా మార్చడంతో పాటు, జుట్టు, చర్మ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.

4 / 5
అవిసె గింజలను మీ దైనందిన ఆహారంలో చేర్చుకోవడం ద్వారా మహిళలు సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే.. మహిళలే కాదు.. చిన్నా పెద్దా అందరూ కూడా అవిసెగింజలను తినవచ్చు..

5 / 5
అవిసె గింజలను నేరుగా పచ్చిగా తినవచ్చు.. ఇంకా వేయించి పొడి చేసుకుని లేదా నానబెట్టి కూడా తినవచ్చు.. అంతేకాకుండా.. అవిసె గింజలను దోరగా వేయించి పొడి చేసుకుని తినవచ్చు.. ఇంకా ఆహార పదార్థాల్లో కూడా కలుపుకుని తీసుకోవచ్చు..

Loading...
Unable to load recommendations.
Follow Us