ఈ పప్పు ప్రయోజనాలు తెలిస్తే.. అస్సలు మిస్‌ చేసుకోరు..! బోలెడన్నీ లాభాలు..

Updated on: Mar 06, 2025 | 3:47 PM

మినపప్పులో రుచితోపాటు బోలెడన్ని ఆరోగ్య ప్రయజనాలు కూడా ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.  ప్రోటీన్లు మెండుగా ఈ పప్పులో  విటమిన్ బీ కూడా పుష్కలంగా ఉంటుంది.  ఆయుర్వేదంలో ఆర్థరైటిస్, ఆస్తమా, పక్షవాతం లాంటి జబ్బుల నివారణలో వాడతారట. అలాగే మినపప్పు తీసుకోవడం వల్ల తల నొప్పి, జ్వరం, ఇంఫ్లమేషన్ వంటి సమస్యలనుంచి దూరం కావచ్చట. ఇంకా మరెన్నో లాభాలు ఉన్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

1 / 5
ఫైబర్‌, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, ఫాస్పరస్ ,  కాల్షియం వంటివి మినపప్పులో అధికంగా ఉన్నాయి. దీనిని తరచుగా తీసుకుంటే ఎముకలకు సంబంధించిన సమస్యలను దూరం చేసుకోవచ్చు. పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బాడీలోని ఐరన్‌ లెవల్స్‌పెరిగేందుకు తోడ్పడుతుంది.

2 / 5
గుండెను హెల్దీగా, దృడంగా ఉంచేలా చేస్తుంది. నాడీ వ్యవస్థను బలపరుస్తుంది, నాడీ బలహీనత, పాక్షక పక్షవాతం, ముఖ పక్షవాతం ,ఇతర రుగ్మతల నివారణకు వివిధ ఆయుర్వేద ఔషధాలలో ఉపయోగిస్తారు. మినపప్పు గ్లూకోజ్ స్థాయిలను  నియంత్రిస్తుంది.. మధుమేహం ఉన్నవారికి కూడా మంచిదని నిపుణులు చెబుతున్నారు.

3 / 5
వెయిట్‌ లాస్‌లో మినప పప్పు  ఉపయోగపడుతుంది, ఎముకలను దృఢంగా ఉంచుతుంది. కిడ్నీలను కాపాడటంలో కూడా  మినపప్పు ఉపయోగపడుతుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తుంది కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది.

4 / 5
నల్ల మినపప్పు చర్మానికి కూడా చాలా మంచి. ముఖంపై నల్ల మచ్చలు, మొటిమలు వంటివి రాకుండా సహాయపడుతుంది. చర్మంపై మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. చర్మం కాంతివంతంగా, ప్రకాశవంతంగా కనిపించేలా చేయడానికి చర్మం వైపు మరింత ఆక్సిజన్‌తో కూడిన రక్తాన్ని తీసుకురావడంలో సహాయపడుతుంది.

5 / 5
ఈ నల్ల పప్పును తీసుకోవటం వల్ల మొత్తం ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా ఈజీగా తగ్గుతాయి. ఇలా చేయడం వల్ల గుండె సంబంధిత వ్యాధులకు చాలా దూరంగా ఉండవచ్చు. పప్పులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను బాగా మెరుగుపరుస్తుంది. ఇది ప్రేగు కదలికను కూడా బాగా సులభతరం చేస్తుంది. అలాగే ఇతర కడుపు సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.