తక్కువ నీటితో సాగు.. ఎక్కువ దిగుబడి! మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్న బెస్ట్‌ పంటలు ఇవే!

Updated on: Nov 20, 2026 | 5:44 PM

Farming Ideas: ఎల్‌నీనో దీని ప్రభావంతో ఈ వర్షాకాలం వానలు లేక భూగర్భజలాలు చాలా వరకు తగ్గిపోయాయి. దీంతో ఖరీఫ్‌ సీజన్‌లో వేసిన పంటలకే సరిగ్గా నీరు అందకా చాలా మంది రైతులు పంటను మధ్యలోనే వదలేశారు. ఇదిలా ఉండగా ఈ క్లిష్ట పరిస్థితుల్లో, ఈ ఏడాది పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను పండించాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రైతులను కోరింది. కాబట్టి మార్కెట్ పరిస్థితులతో పాటు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉండే ఐదు పంటల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1 / 5
జొన్నలు: తక్కువ నీటితో ఎక్కవ దిగుబడి ఆదాయాన్ని ఇచ్చే పంటల్లో జొన్నలు ఒకటి.. జొన్నకు వేడి వాతావరణంతో, కరువు పరిస్థితులను కూడా తట్టుకునే సామర్థ్యం ఉంటుంది. వరితో పోల్చుకుంటే ఈ పంటకు నీరు చాలా తక్కువ అవసరం కేవలం 350 నుంచి 400 మిల్లీమీటర్ల వర్షపాతంతో కూడా ఇవి మంచి దిగుబడిని ఇస్తాయి. అలాగే ఇవి ఆరోగ్యానికి కూడా ఎంతో మంచికి కాబట్టి వీటికి మార్కెట్‌లో డిమాండ్‌ కూడా ఎక్కవగానే ఉంటుంది. అంతేకాదు వీటిటి వేస్ట్‌ను కూడా పశువులకు మేతగా వాడుతారు కాబట్టి దాన్ని అమ్ముకున్నా రైతులకు ఆదాయం వస్తుంది.

2 / 5
కందులు: యాసంగిలో రైతులు ఎక్కువగా వేసే పంటల్లో ఇది కూడా ఒకటి. వర్షం ఆలస్యంగా వచ్చినా కూడా కందులు నిలబడతాయి. అంతేకాదు, కందులు నేలలో నత్రజనిని స్థిరపరచడం ద్వారా భూమి సారాన్ని కూడా పెంచుతాయి. అంటే ఒకవైపు ఆదాయం, మరోవైపు భూమి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రస్తుతం దేశంలో కందుల డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది, విదేశాల నుంచి కూడా దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది, ఇది వాటి మార్కెట్ అవకాశాలను సూచిస్తుంది.

3 / 5
సజ్జలు: వీటిని కూడా తక్కువ నీటితో సాగు చేయవచ్చు. 30 నుంచి 40 రోజుల పాటు వర్షం లేకపోయినా సజ్జలు నిలబడగలవు. ఈ లక్షణం కరువు పరిస్థితుల్లో రైతులకు మంచి భరోసాను అందిస్తుంది. ఒకప్పుడు పేదలు ఎక్కవుగా తినే ఆహారంగా భావించిన సజ్జలు.. ప్రస్తుతం నగరాల్లో ఖరీదైన హెల్త్ ఫుడ్ గా మారిపోయాయి. వీటితో ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కవగా ఉండడంతో వీటికి డిమాండ్ కూడా బాగా పెరిగిపోయింది. దీంతో వీటిని సాగు ద్వారా రైతులు కూడా మంచి లాభాలు పొందవచ్చు.

4 / 5
కొర్రలు: కొర్రల వీటికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే.. ఇవి చాలా త్వరకు చేతికి వచ్చే. వీటిని 60 నుంచి 70 రోజుల్లోనే సాగు చేయవచ్చు. తక్కువ నీరు, తక్కువ పెట్టుబడితో సాగు చేయగల ఈ పంటకు మార్కెట్‌లో కూడా మంచి డిమాండ్ ఉంది.చిరుధాన్యాల వినియోగం ఇటీవల భారీగా పెరగడంతో, భవిష్యత్తులో కూడా కొర్రలకు మంచి మార్కెట్ ఉండే అవకాశం ఉంది.

5 / 5
నువ్వులు: నువ్వులు కూడా తక్కువ నీటితో పండించే పంటల్లో ఒకటి. వీటికి దేశీయంగానే కాదు, అంతర్జాతీయ మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది. నువ్వుల నూనె, స్వీట్స్, వివిధ ఆహార పదార్థాల్లో వీటి వినియోగం ఎక్కువ. తక్కువ నీటితో సాగు చేయగలిగే ఈ పంట రైతులకు మంచి ఆదాయాన్ని అందిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా నువ్వుల సాగును ప్రోత్సహిస్తోంది.NOTE: అయితే ఈ పంటలు వేసే ముందు మీ భూమి రకాన్ని తీసుకెళ్లి వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలను సంప్రదించి నిర్ణయం తీసుకోవడం మంచిది.  సరైన నిర్ణయం ఈ ఏడాది రైతుల లాభనష్టాలను నిర్ణయిస్తుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us