
అయితే ఎల్నినో ప్రభావం ఉన్న సమయంలో మీ ఇంటి మొక్కలు ఎండిపోకుండా పచ్చగా ఉండాలి అనుకుంటున్నారా? అయితే తప్పకుండా ఈ చిట్కాలు పాటించాలని చెబుతున్నారు నిపుణులు. కాగా, ఇప్పుడు మనం మొక్కలు పచ్చగా ఉండాలి అంటే? ఏ చిట్కాలు పాటించాలో చూద్దాం.

ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు అందమైన మొక్కలు పెంచుకుంటారు. అవి ఎండిపోవడం అస్సలే మంచిది కాదు. ఇంటి కల పోవడమే కాకుండా ప్రతికూల ప్రభావం కూడా పడుతుంది. అందువలన మీ ఇంటిలో ఉన్న మొక్కలు ఎప్పుడూ పచ్చిగా ఉండాలి అంటే తప్పకుండా వాటికి మజ్జిగ నీరు పోయాలి అని చెబుతున్నారు నిపుణులు.

ప్రతి రోజూ మొక్కలకు నీరు పోయకపోయినా పర్వాలేదు కానీ, వారంలో రెండు లేదా మూడు సార్లు మజ్జిగ నీరు పోయడం వలన మొక్కలు చాలా వేగంగా పెరుగుతాయంట. మజ్జిగలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అందువలన దీనిని మొక్కలకు వేయడం వలన మొక్క వేరు భాగం నుంచి బలంగా తయారు అవుతుంది. ఎప్పుడూ పచ్చగా ఉంటుంది. అలాగా చాలా వేగంగా పెరుగుతుందంట.

అయితే దానిని వేసే విధానం బట్టి మొక్క పెరగడం ఆధారపడి ఉంటుంది. మజ్జిగలో కారం ఉప్పు వంటివి వేయకూడదు. చాలా మంది వంటల్లో ఉపయోగించిన దానిని మొక్కలకు వేయడం చేస్తుంటారు. కానీ ఇది అస్సలే మంచిది కాదు. దీని వలన మొక్క త్వరగా పాడైపోయే చాన్స్ ఉంటుంది. అందువలన వంటలో ఉపయోగించినది, కారం, ఉప్పు కలిపిన మజ్జిగను మొక్కలకు ఉపయోగించకూడదు.

కేవలం సహజ పెరుగును తీసుకొని మజ్జిగ చేసి మొక్కలకు వేయాలి. అయితే దీనిని వారంలో రెండు లేదా మూడు సార్లు లేదా? 15 నుంచి 20 రోజులకు ఒకసారి వేసినా ఎలాంటి సమస్య ఉండదు. మజ్జిగను వేయడం వలన ప్రతి రోజూ నీళ్లు పోసినంత బలం మొక్కకు చేకూరుతుంది. అందువలన ఈ కరువు పరిస్థితుల్లో మొక్కకు 15 రోజులకు ఒకసారి మజ్జిగ అందించడం వలన మొక్క పచ్చగా వేపుగా పెరుగుతుంది. అయితే ఇలా మొక్కలకు మజ్జిగ వేసినప్పుడు దుర్వాసన లేదా చిన్న పురుగులు కనిపిస్తే దీనిని వేయడం ఆపివేయడమే మంచిది.