బయట ఎక్కువ ఖరీదు పెట్టి కొనకుండా ఎంతో టేస్టిగా ఉండే బెల్లం రవ్వ కేసరి ఇంట్లోనే..

Updated on: May 11, 2026 | 11:06 PM

Rava Kesari Recipe : బెల్లం రవ్వ కేసరి ఇంట్లో తయారు చేసుకుని తింటే భలే రుచిగా ఉంటుంది. బయట ఎక్కువ ఖరీదు పెట్టి కొనకుండా ఎంతో టేస్టిగా చేసుకోవచ్చు. మరి, ఇంకెందుకు లేట్ దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం..

1 / 5
మీకు ఏదైనా తీపి తినాలనిపించినప్పుడు ఈ రెసిపీ ట్రై చేసి తినండి, మీకు ఇది చాలా చాలా  తక్కువ సమయంలో అయిపోతోంది. ఇంకా ఇది స్వీట్ గా కూడా ఉంటుంది చాలా మందికి ఫేవరేట్ కూడా అదే బెల్లం రవ్వ కేసరి. మరి, ఇంకెందుకు ఆలస్యం దీనికి కావాల్సిన పదార్దాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ చదివి వివరంగా చదివి తెలుసుకుందాం..

2 / 5
బెల్లం రవ్వ కేసరి రెసిపీ కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు బొంబాయి రవ్వ , ఒక కప్పు బెల్లం, రెండు కప్పులు నీరు , 
నాలుగు టేబుల్ స్పూన్స్ నూనె , 10 కిస్మిస్, ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి , ఇంకా దీనిలో కొద్దిగా కుంకుమపువ్వు , అది లేకపోతే ఫుడ్ కలర్ దీనిలో వాడొచ్చు.  ఈ  కేసరి రుచికే కాదు ఆరోగ్యానికీ కూడా చాలా మంచిది.

బెల్లం రవ్వ కేసరి రెసిపీ కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు బొంబాయి రవ్వ , ఒక కప్పు బెల్లం, రెండు కప్పులు నీరు , నాలుగు టేబుల్ స్పూన్స్ నూనె , 10 కిస్మిస్, ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి , ఇంకా దీనిలో కొద్దిగా కుంకుమపువ్వు , అది లేకపోతే ఫుడ్ కలర్ దీనిలో వాడొచ్చు. ఈ కేసరి రుచికే కాదు ఆరోగ్యానికీ కూడా చాలా మంచిది.

3 / 5
బెల్లం రవ్వ కేసరి తయారీ విధానం: ముందుగా పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి, మీడియం మంటపై బాగా వేయించాలి.  ఇంకా సువాసన వచ్చే వరకు వీటిని బాగా వేయించాలి. ఇంకా వెంటనే ఇంకో గిన్నె తీసుకుని దానిలో కొద్దిగా నీరు పోసి వాటిని కూడా మరిగించాలి. అయితే, అందులో బెల్లం వేసి పాకం అయ్యే లాగా బాగా  కరిగించాలి.

4 / 5

ఇప్పుడు ఈ బెల్లం నీటిని వడగట్టి మళ్లీ స్టవ్ మీద కొద్దిసేపు పెట్టుకోవాలి.  అలాగే, మరుగుతున్న బెల్లం నీటిలో ముందుగా  వేయించి పక్కన పెట్టుకున్న రవ్వను కొద్దీ కొద్దిగా పోస్తూ బాగా కలపాలి. పేస్ట్ లాగా అయ్యే వరకు వాటిని చిన్నగా  కలుపుతూ ఉండాలి.
రవ్వ బాగా ఉడికనివ్వాలి.

ఇప్పుడు ఈ బెల్లం నీటిని వడగట్టి మళ్లీ స్టవ్ మీద కొద్దిసేపు పెట్టుకోవాలి. అలాగే, మరుగుతున్న బెల్లం నీటిలో ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న రవ్వను కొద్దీ కొద్దిగా పోస్తూ బాగా కలపాలి. పేస్ట్ లాగా అయ్యే వరకు వాటిని చిన్నగా కలుపుతూ ఉండాలి. రవ్వ బాగా ఉడికనివ్వాలి.

5 / 5
చివర్లో యాలకుల పొడి ఇంకా కొంచం కుంకుమపువ్వు కూడా వేసి  బాగా కలువుకోవాలి. అలాగే,  చిన్న పాన్‌లో కొద్దిగా నెయ్యి  చేసి మీరు ముందుగా పెట్టుకున్న  జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసి కేసరిలో బాగా కలపాలి. కొద్దీ సేపు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి కిందకు దించేయాలి. ఇంకా ఆ తరవాత దీనిని వేడి వేడిగా తినొచ్చు. ఈ బెల్లం రవ్వ కేసరి నోట్లోనే కరిగిపోతోంది.

Follow Us