నేలపై పాకకుండా చక్రంలా తిరిగే పాము గురించి తెలుసా?

Updated on: Oct 22, 2026 | 1:48 PM

పాముల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ భూమిపై అనేక రకాల పాములు ఉన్నాయి. అందులో కొన్ని చాలా విషపూరితమైనవి అవుతే కొన్ని విషం లేని పాములు కూడా ఉన్నాయి. ఇక చాలా వరకు పాములు అంటే పాకుతూ వెళ్తాయని ప్రతి ఒక్కరికీ తెలుసు కానీ పాకకుండా చక్రంలా తిరిగే పాము గురించి విన్నారా? ఇప్పుడు దాని గురించే తెలుసుకుందాం.

1 / 5
పాములు చాలా పొడవుగా ఉంటాయి. అవి చాలా వేగంగా పాకుతూ ఉంటాయి. అయితే అత్యంత చిన్నగా ఉండే ఒక పాము పాత్రం పాకకుండా చక్రంలా తిరుగుతూ ఉంటుందంట. ఇంతకీ అది ఏ పాము అనుకుంటున్నారా? డ్వార్ఫ్ రీడ్ స్నేక్. ఇది అత్యంత చిన్నదైన అలాగే అరుదైన పాము. దీని శాస్త్రీయ నామం సూడోరాబ్డియన్ లాంగిసెప్స్. ఇది Calamaria జాతికి చెందినది.  దీనిని తెలుగులో మరుగుజ్జు నీటి పాము అని కూడా అంటారు.

2 / 5
అయితే ఈ పాము కేవలం 20 నుంచి 25 సెం. మీ మాత్రమే ఉంటుందంట. చూడటానికి కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇది ఎక్కువగా గోధుమ, నలుపు రంగంలో ఉంటుంది. కడుపు భాగం పసుపు, ఎరుపు, తెలుపు రంగులో ఉంటుంది. అయితే కొంత మంది ఇది ప్రమాదకర పాము అనుకుంటారు. కానీ ఇది విషం లేని పాము.

3 / 5
డ్వార్ఫ్ రీడ్ స్నేక్ పూర్తిగా విషం లేని పాము. దీని వలన మానవులకు ఎలాంటి హాని జరగదు. అయితే ఈ పాము దానికి ప్రమాదం ఎదరు అవుతుందని అనిపిస్తే చాలు తన శరీరాన్ని చక్రంలా మార్చుకొని పాకకుండా దొర్లుతూ పారిపోతుందంట. అయితే ఈ దొర్లే సమయంలో కూడా తన తల వంగకుండా నిటారుగా ఉంచి దొర్లుతూ పారిపోతుంది.

4 / 5
అందుకే చాలా మంది ఈ పామును చక్రాల్లా దొర్లేపాము అని కూడా అంటారు. అంతే కాకుండా ఇది నేలపై పాకే పాముకంటే చాలా వేగంగా దొర్లుతూ వెళ్తుందంట.  చాలా వరకు ఉన్న పాముల్లో ఏ పాము కూడా ఇలా వేగంగా దొర్లుతూ వెళ్లదు అని చెబుతున్నారు నిపుణులు.

5 / 5
ఈ పాము ఎక్కువగా తేమగా ఉండే అడవుల్లో, ఆకుల కింద, మట్టిలో దాక్కుని ఉంటుంది. వానపాములు, చిన్న కీటకాలను తింటుంది. భారత దేశంలో,ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ కనుమల్లో అరుదుగా కనిపిస్తుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us