
గాఢ నిద్ర పడుతుంది: పిప్పర్‌మింట్ టీలో సహజంగానే కెఫిన్ ఉండదు. దీనిలోని మెంతోల్ గుణాలు కండరాలను సడలించి, మనస్సును ప్రశాంతపరుస్తాయి. రాత్రి వేళ దీని సువాసన పీల్చడం వల్ల మానసిక అలసట తగ్గి సులభంగా, గాఢమైన నిద్ర పడుతుంది. నిద్రలేమితో బాధపడేవారికి ఇది మంచి నైట్ డ్రింక్.

జీర్ణక్రియ సులువవుతుంది: రాత్రి పూట భారీగా భోజనం చేసిన తర్వాత వచ్చే కడుపు ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీ లేదా అజీర్తిని పిప్పర్‌మింట్ టీ తక్షణమే నివారిస్తుంది. ఇది ప్రేగుల కండరాలను రిలాక్స్ చేసి జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. కడుపు నొప్పి, ఇర్రిటబుల్ బౌల్ సిండ్రోమ్ సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.

శ్వాసకోశ వ్యవస్థకు మంచిది: ముక్కు దిబ్బడ, జలుబు లేదా అలర్జీల వల్ల రాత్రి వేళ సరిగా శ్వాస తీసుకోలేకపోతున్నారా? పుదీనా టీలోని మెంతోల్ నాసికా మార్గాలను తెరిచి, గొంతు కిరాటును తగ్గిస్తుంది. పడుకునే ముందు ఇది తాగడం వల్ల హాయిగా శ్వాస తీసుకోవచ్చు.

నోటి దుర్వాసన మాయం: పిప్పర్‌మింట్‌లో యాంటీ బాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. నిద్రపోయే ముందు ఇది తాగడం వల్ల నోట్లోని హానికర బ్యాక్టీరియా నశించి, ఉదయం లేచేసరికి నోటి దుర్వాసన రాకుండా తాజా శ్వాస లభిస్తుంది.

మానసిక ఒత్తిడి, తలనొప్పి నుంచి ఉపశమనం: రోజంతా పనిభారంతో వచ్చే టెన్షన్ మైగ్రేన్ లేదా ఒత్తిడి తలనొప్పులను పిప్పర్‌మింట్ లోని అరోమా తగ్గిస్తుంది. ఇది నరాల వ్యవస్థను శాంతపరిచి రిలాక్స్ అవ్వడానికి దోహదపడుతుంది.

ఎలా తయారు చేయాలి?: ఒక పాత్రలో నీటిని మరిగించి అందులో కొన్ని తాజా పుదీనా ఆకులు లేదా పిప్పర్‌మింట్ టీ బ్యాగ్ వేసి 5-10 నిమిషాలు ఉంచాలి. తర్వాత దాన్ని వడకట్టి, గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. అవసరమైతే కొద్దిగా తేనె కలుపుకోవచ్చు. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఈ డ్రింక్ తాగడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా ప్రశాంతమైన నిద్ర మీ సొంతమవుతుంది.