దీపావళి పండుగ స్పెషల్.. నేతి బొబ్బట్లు మీ ఇంట్లోనే ఇలా నిముషాల్లోనే చేసేయండి

Updated on: Nov 03, 2026 | 5:53 PM

పండుగలు, ప్రత్యేక సందర్భాలలో ఇంట్లో తయారుచేసే సంప్రదాయ వంటకాలకు ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి వాటిలో నేతి బొబ్బట్లు కూడా ఒకటి. స్వీట్ షాపుల్లో ఉండేలా గట్టిగా, రుచికరంగా ఉండే నేతి బొబ్బట్లను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

1 / 5
ముందుగా, బొబ్బట్ల పైపిండిని తయారు చేసుకోవాలి. ఒక కప్పు గోధుమపిండి, ఒక కప్పు మైదా పిండిని తీసుకోండి. దీనికి కొద్దిగా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని  కలిపి, నెయ్యి పిండికి బాగా పట్టేలా కలపాలి. గోధుమపిండితో మాత్రమే చేయాలనుకుంటే, రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నీటిని కొద్దికొద్దిగా పోసుకుంటూ, పిండిని చపాతీ పిండిలా గట్టిగా కాకుండా, చేతికి అంటుకునే విధంగా గట్టిగా  కలుపుకోవాలి.

2 / 5
పిండి అంటుకునే విధంగా ఉంటేనే బొబ్బట్లు మృదువుగా వస్తాయి. పిండి కలిపిన తర్వాత, ఇంకో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాగా కలిసేలా మర్దించుకోవాలి. ఆ తర్వాత, పిండి ఆరిపోకుండా పైన ఒక టీస్పూన్ నెయ్యి పూసి, మూత పెట్టి కనీసం ఒక గంటపాటు నానబెట్టాలి. పిండి బాగా నానితే  బొబ్బట్లు మంచి రుచిగా ఉంటాయి.

3 / 5
లోపల పెట్టే పూర్ణం కోసం, ఒక కప్పు పచ్చిశనగపప్పు తీసుకోండి. పప్పును ఒకటి, రెండు సార్లు శుభ్రంగా కడిగి, రెండు కప్పుల నీళ్లు పోసి గంటపాటు నానబెట్టాలి. నానబెట్టిన పప్పును ప్రెషర్ కుక్కర్‌లో మూడు విసిల్స్ వచ్చేవరకు మీడియం మంటపై ఉడికించాలి. కుక్కర్ ప్రెషర్ పూర్తిగా పోయిన తర్వాత, పప్పును జాలి గిన్నెలోకి తీసుకుని నీళ్లు వడకట్టండి. పప్పు పూర్తిగా వడారిన తర్వాత, మళ్లీ కుక్కర్‌లోకి వేసి మ్యాషర్‌తో లేదా పప్పుగుత్తితో మెత్తగా మ్యాష్ చేయాలి. మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు.

4 / 5
మెత్తగా మ్యాష్ చేసిన పప్పులో ఒక కప్పు తురిమిన బెల్లం వేసి బాగా కలపాలి. స్వీట్ ఎక్కువ కావాలంటే పావు కప్పు బెల్లం అదనంగా వేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని స్టవ్ పై పెట్టి, మీడియం మంటపై కలుపుకుంటూ ఉడికించాలి. వేడికి బెల్లం కరిగి మిశ్రమం పల్చబడుతుంది. ఇది మళ్ళీ దగ్గరపడే వరకు, అడుగు అంటకుండా నిరంతరం కలుపుతూ ఉండాలి. బెల్లం గడ్డలు ఉంటే మ్యాష్ చేస్తూ ఉడికించండి.

5 / 5
బొబ్బట్లను వత్తడానికి బట్టర్ పేపర్ లేదా ఆయిల్ ప్యాకెట్/మిల్క్ ప్యాకెట్‌ను ఉపయోగించవచ్చు. ఎంచుకున్న పేపర్‌కు కొద్దిగా నెయ్యి పూసి సిద్ధంగా ఉంచుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన పిండి నుంచి చిన్న ముద్దను తీసుకుని, చేతితో కొంచెం మందంగా వత్తి, మధ్యలో పూర్ణం ఉండను పెట్టి అన్ని వైపుల నుండి మూసేయాలి. అదనపు పిండిని తీసేసి, పూర్ణం బయటకు రాకుండా చూసుకోవాలి. పిండి మూసిన భాగాన్ని కిందకు ఉంచి, చేతికి నెయ్యి రాసుకుని, నెమ్మదిగా పల్చగా వత్తుకోవాలి. మధ్య మధ్యలో నెయ్యి రాసుకుంటూ వత్తితే ఈజీగా  వస్తుంది.బొబ్బట్లను కాల్చడానికి, పెనాన్ని బాగా వేడి చేసి, మీడియం మంటపై ఉంచండి. బొబ్బట్టును పేపర్‌తో సహా పెనంపై వేసి, నెమ్మదిగా పేపర్‌ను తీసివేయాలి. ఒకవైపు కొద్దిగా కాలిన తర్వాత తిప్పి, రెండు వైపులా నెయ్యి వేసుకుంటూ బంగారు రంగు వచ్చేవరకు కాల్చాలి. మంటను మీడియంలో ఉంచడం వల్ల బొబ్బట్లు మాడిపోకుండా చక్కగా కాలుతాయి. ఈ విధంగా అన్ని బొబ్బట్లను కాల్చుకోవాలి.

Loading...
Unable to load recommendations.
Follow Us