IND Vs ENG: టీమిండియాలో వాడు మా జట్టులో ఉంటే బాగుండేది.. నా అల్లుడూ ఉన్నా వేస్ట్

Updated on: Mar 06, 2026 | 2:06 PM

టీ20 ప్రపంచకప్ 2026 సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై టీం ఇండియా అద్భుత విజయం సాధించింది. ఈ గెలుపుపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ భిన్నాభిప్రాయాన్ని తెలిపారు. ఒత్తిడిలో భారత్ రాణించిన తీరును ప్రశంసించిన అఫ్రిదీ, ముఖ్యంగా బుమ్రా బౌలింగ్‌ను కొనియాడారు. ఆ వివరాలు..

1 / 5
టీ20 ప్రపంచకప్ 2026 సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీం ఇండియా ఏడు పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించి ఫైనల్‌కు దూసుకుపోయింది. ఈ మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు రషీద్ లతీఫ్, మహమ్మద్ అమీర్, షాహిద్ అఫ్రిదీ వంటి వారు టీం ఇండియా గెలవదని ప్రిడిక్షన్లు చేశారు. వారి సొంత జట్టు పాకిస్తాన్ గ్రూప్ దశ నుంచే నిష్క్రమించిన నేపథ్యంలో, తమ జట్టు లోపాలను సరిచేసుకోకుండా భారత్‌పై ప్రతికూల వ్యాఖ్యలు చేశారు.

2 / 5
వాంఖడే స్టేడియంలో గురువారం జరిగిన ఉత్కంఠభరితమైన ఈ మ్యాచ్‌లో, ఇంగ్లాండ్ బ్యాటర్ జాకబ్ బెథెల్ 105 పరుగులతో పోరాడినప్పటికీ, టీం ఇండియా విజయాన్ని సొంతం చేసుకుంది. మ్యాచ్ ఆఖర్లో జస్ ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్య అద్భుతంగా బౌలింగ్ చేసి భారత్‌కు విజయాన్ని అందించారు.

3 / 5
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీం ఇండియాలో అభిషేక్ శర్మ మినహా ప్రతి బ్యాట్స్‌మన్ పరుగులు రాబట్టారు. ముఖ్యంగా సంజూ శాంసన్ వరుసగా రెండో హాఫ్ సెంచరీ నమోదు చేసి, ఇంగ్లాండ్ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాడు. బౌలింగ్‌లో టీం ఇండియా ఒక దశలో వెనుకబడినట్లు కనిపించినా, బుమ్రా, హార్దిక్ పాండ్య కీలక సమయాల్లో రాణించి జట్టును కాపాడారు.

4 / 5
ఈ విజయంపై స్పందించిన పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ, ఒత్తిడిలో ఎలా రాణించాలో టీం ఇండియాను చూసి ఇతర జట్లు నేర్చుకోవాలని పేర్కొన్నారు. తమ జట్టు కూడా భారత్ నుంచి నేర్చుకోవాలన్నారు. ముఖ్యంగా, బుమ్రా పరుగులను అద్భుతంగా నియంత్రించాడని అఫ్రిదీ ప్రశంసించారు. తన అల్లుడైన షాహీన్ అఫ్రీదీ ఇలాంటి స్పెల్ వేసి ఉంటే, పాకిస్తాన్ శ్రీలంకపై అధిక నెట్ రన్ రేట్‌తో సెమీస్‌లోకి ప్రవేశించేదని అఫ్రిదీ అభిప్రాయపడ్డారు. బ్యాటింగ్ పిచ్‌పై బుమ్రా బౌలింగ్ అద్భుతమని ఆయన కొనియాడారు.

5 / 5
అయితే, షాహిద్ అఫ్రిదీ తన వైఖరిని మార్చుకోకుండా, ఫైనల్‌లో టీం ఇండియా ఓడిపోతుందని మరో ప్రిడిక్షన్ చేశారు. టీం ఇండియా కంటే న్యూజిలాండ్ చాలా బలంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. మొత్తంగా చూస్తే, టీం ఇండియా ఈ కప్పును గెలవడం పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లకు ఇష్టం లేనట్లు కనిపిస్తుంది. ప్రతి ఒక్క మాజీ ఆటగాడు టీం ఇండియా ఓడిపోవాలని కోరుకుంటున్నారు. అయితే, వారి ప్రిడిక్షన్లకు విరుద్ధంగా టీం ఇండియా వరుస విజయాలతో ఫైనల్‌కు చేరింది.

Follow Us