
పులుపు, ఎక్కువ ఉప్పు ఉన్న ఆహారాలు అల్యూమినియంలో వండినప్పుడు లోహ కణాలు ఆహారంలో కలిసిపోతాయి. దీన్నే 'అల్యూమినియం లీచింగ్' అంటారు. ఇది దీర్ఘకాలంలో కిడ్నీలు, ఎముకలు, నరాల సమస్యలను తెచ్చిపెట్టవచ్చు. దీనికి బదులుగా స్టెయిన్‌లెస్ స్టీల్ లేదా మట్టి పాత్రలు వాడటం ఉత్తమం.

అలాగే వినెగర్ కలిపిన వంటకాలను ఎప్పుడూ అల్యూమినియం పాత్రల్లో అస్సలు వండకూడదు. ఎందుకుంటే అల్యూమినియం వినెగర్‌తో చాలా త్వరగా రసాయన చర్య జరుపుతుంది. అప్పుడు ఆహారంలో ఈ రసాయనాలు చేరుతుంది. అలాంటి ఫుడ్ తింటే శరీరానికి తీవ్ర హానికరం. కాబట్టి ఎప్పుడు కూడా వెనిగర్ వాడే వంటకాలను అల్యూమీనియం పాత్రల్లో వండకండి.

టమాటా కూరలను కూడా అల్యూమీనియం పాత్రల్లో వండడం ఆపేయాలి. ఎందుకంటే టమాటోలలో ఉండే సహజ ఆమ్లం వల్ల ఆహారంలోకి అల్యూమినియం లోహం ఎక్కువగా చేరుతుంది. దీనివల్ల వంటకాల రుచి మారడమే కాకుండా విషపూరితంగా మారి ఆరోగ్యానికి చేటు చేస్తుంది. అలాగే నిమ్మకాయ, సిట్రస్ పండ్లు, చింతపండు వంటివి కూడా అల్యూమీనం పాత్రల్లో ఉంచారాదు.

ఎందుకంటే వీటలోని ఆమ్లాలు అల్యూమినియంతో చాలా త్వరగా తీవ్ర చర్య జరుపుతాయి. అందుకే చింతపండు చట్నీలు, పులుసులను అల్యూమినియం పాత్రల్లో వండటం లేదా ఎక్కువసేపు నిల్వ చేయడం చేయకూడదు. చాలా కారంగా ఉండే ఆహారాలు కూడా వీటిలో వండవద్దు. అలాగే పెరుగు, మజ్జిగ, ఇతర పాల ఉత్పత్తులలో లాక్టిక్ ఆమ్లం ఉంటుంది. ఇది అల్యూమినియంతో చర్య జరిపి హానికరమైన విష పదార్థాలను ఏర్పరుస్తుంది కాబట్టి వీటిని ఈ పాత్రల్లో ఉంచడం లేదా వండడం మానేయాలి.

అలాగే బంగాళాదుంప కూరలను కూడా ఎప్పుడూ అల్యూమీనియం పాత్రల్లో చేయరాదు. ఎందుకంటే వాటిలో సహజ ఆమ్లాలు ఉంటాయి. అల్యూమినియం పాత్రల్లో వండినప్పుడు అవి చర్య జరిపి ఆహారం రుచిని మార్చడంతో పాటు ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతాయి. వీటికి బదులు స్టెయిన్‌లెస్ స్టీల్ లేదా ఇనుప పాత్రలు వాడటం ఎంతో సురక్షితం.