
విజయ్ దళపతి, త్రిష కాంబినేషన్ చాలా మందికి ఇష్టం. అంతే కాకుండా వీరి కాంబోలో సినిమా వచ్చిందంటే అది బాక్సీఫీస్ వద్ద రికార్డ్స్ క్రియేట్ చేయాల్సిందే. ఎందుకంటే వీరి కెమెస్ట్రీ సిల్వర్ స్క్రీన్ పై అదిరిపోతుంది. అంతే కాకుండా చాలా మందికి ఈ జంట ఫేవరెట్ అనే చెప్పాలి. అయితే వీరిద్దరు కలిసి దాదాపు ఐదు సినిమాల్లో నటించారంట. ముఖ్యంగా విజయ్, త్రిష కలిసి 2004 గిల్లి సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.

ఇక దీని తర్వాత త్రిష విజయ్ కలిసి నటించిన సినిమా తరుపాచి. ఈ మూవీ 2005లో రిలీజై బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించింది. వీరి కాంబోలో వచ్చిన రెండో మూవీ అయినా ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. అంతే కాకుండా అభిమానుల మనసు దోచుకుంది. ఇక విజయ్ కెరీర్ మలుపు తిప్పిన సినిమాల్లో ఇది కూడా ఒకటి.

అదే విధంగా, ఆది(Aathi) సినిమాలో కూడా విజయ్, త్రిష కలిసి ముచ్చటగా మూడో సారి నటించారు. ఇక ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అంతగా బజ్ క్రియేట్ చేయకపోయినప్పటికీ చాలా మంది మనసులో మాత్రం స్థానం సంపాదించుకుంది. ఇక ఈ మూవీలో వీరిద్దరి కెమిస్ట్రీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఈ మూవీ తర్వాత చాలా రోజులు గ్యాప్ తీసుకొని మరోసారి 2008లో మరో సారి ఈ జంట థియేటర్లో సందడి చేసింది. విజయ్, త్రిష కలిసి నాలుగో సారి, కురివి మూవీలో నటించారు. ఈ మూవీ చాలా వరకు యాక్షన్స్ సీక్వెన్స్‌లో కొనసాగింది. ఇక ఈ సినిమా కూడా థియేటర్లలో రిలీజై పర్వాలేదనిపించింది.

దీని తర్వాత చాలా సంవత్సరాల తర్వాత 2023లో ఈ క్యూట్ కపుల్ జోడి కట్టారు. విజయ్ సినిమాల్లోనే భారీ బడ్జెట్‌తో నిర్మించిన లియో మూవీలో త్రిష కీలక పాత్రలో నటించి మెప్పించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అలా వీరి కాంబోలో ఐదు సినిమాలు రిలీజ్ అయ్యాయి.