Trivikram: ఇలాంటి లక్షణాలు ఉన్నవాళ్లు 100 శాతం సక్సెస్ అవుతారు.. త్రివిక్రమ్ చెప్పిన జీవిత సత్యాలు..

Updated on: Oct 17, 2026 | 1:34 PM

ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించిన ఒక స్ఫూర్తిదాయక విషయం ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. జీవితంలో విజయం సాధించడానికి అవసరమైన ప్రాథమిక లక్షణాలను వెల్లడించారు. సమయపాలన, క్రమశిక్షణ, నిజాయితీ, ముక్కుసూటిగా వ్యవహరించడం వంటివి ఒక వ్యక్తిని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లే గుణాలు. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకుండా, తన లక్ష్యాలపై స్పష్టమైన దృష్టి సారించడం చాలా ముఖ్యం అని ఆయన తెలియజేశారు.

1 / 5
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మాటల మాంత్రికుడిగా మాత్రమే కాకుండా, అద్భుతమైన జీవిత సత్యాలను తన మాటల ద్వారా చెప్పే తత్వవేత్తగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఆయన సినిమాల్లోని డైలాగ్స్ ఎంతగా ఆకట్టుకుంటాయో, ఆయన చెప్పే స్ఫూర్తిదాయకమైన మాటలు కూడా మనుషులలో నిరాశను పారద్రోలి ముందుకు నడిపిస్తాయి. గతంలో ఒక వేదికపై జీవితంలో విజయం సాధించడానికి ఉండాల్సిన కొన్ని ముఖ్యమైన లక్షణాల గురించి త్రివిక్రమ్ పంచుకున్న విలువైన ఆలోచనలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

2 / 5
జీవితంలో ఎదగాలనుకునే ప్రతి ఒక్కరికీ ఉండాల్సిన మొదటి గుణం సమయపాలన (Punctuality) అలాగే క్రమశిక్షణ (Discipline). ఏ రంగంలోనైనా సరే సమయానికి విలువనిచ్చి, క్రమపద్ధతిలో పనిచేసేవారే అంతిమంగా విజయం సాధిస్తారని త్రివిక్రమ్ స్పష్టం చేశారు. అలాగే మనిషికి ఎప్పుడూ నిజాయితీ, ముక్కుసూటితనం చాలా ముఖ్యమని, ఇది సమాజంలో మనకు నమ్మకాన్ని తెచ్చిపెడుతుందని ఆయన పేర్కొన్నారు.

3 / 5
అనవసరమైన విషయాలపై తలదూర్చకుండా, మన పరిధి ఏమిటో తెలుసుకుని ముందుకు సాగడం గొప్ప లక్షణం. ప్రతి మనిషి జీవితంలో ఎన్నో సమస్యలు, విషయాలు ఎదురవుతుంటాయి. అయితే ఏది మనకు అవసరం, ఏది అనవసరం అనే విచక్షణ ఉండటం చాలా ముఖ్యం. అనవసరమైన విషయాలకు ప్రాధాన్యత ఇస్తూ సమయాన్ని వృధా చేసుకోకూడదని, మన లక్ష్యం ఏదో దానిపైనే పూర్తి ఏకాగ్రత పెట్టాలని త్రివిక్రమ్ హితవు పలికారు.

4 / 5
మనకు అవసరమైన ఏ పనైనా సరే, దాన్ని కూలంకషంగా పరిశీలించి, క్షుణ్ణంగా అర్థం చేసుకుని చివరి వరకు పట్టుదలగా సాధించాలని సూచించారు. ఎవరైతే ఈ లక్షణాలను తమ జీవితంలో అలవాటు చేసుకుంటారో, వారిని వెతుక్కుంటూ విజయాలు వస్తాయని, అలాంటివారు జీవితంలో వందశాతం సక్సెస్ అవుతారని ఆయన అద్భుతమైన సందేశాన్నిచ్చారు. అందుకే త్రివిక్రమ్ మాటలకు ఎంతో మంది అభిమానులు ఉంటారు.

5 / 5
ప్రస్తుతం త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న సినిమా ఆదర్శ కుటుంబం. విక్టరీ వెంకటేశ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రాన్ని ముందుగా అక్టోబర్ 9న విడుదల చేయాలనుకున్నారు. కానీ అనుహ్యంగా ఈ మూవీ వాయిదా పడడం అభిమానులకు తీవ్ర నిరాశకు గురి చేసింది. ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడంతోనే విడుదలకు వాయిదా వేయాల్సి వచ్చినట్లు తెలుస్తోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us