రెండో సారీ ప్రేమించి పెళ్లి చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరోలు వీరే!

Updated on: Feb 03, 2026 | 11:29 AM

చిత్ర పరిశ్రమలో ప్రేమ పెళ్లి, డివోర్స్ చాలా కామన్. ఇక ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోలు వివాహం అయిన తర్వాత కూడా రెండో సారి ప్రేమలో పడి, రెండో వివాహం చేసుకున్నారు. కాగా, రెండో సారీ ప్రేమించి పెళ్లి చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.

1 / 5
అక్కినేని నాగ చైతన్య : టాలీవుడ్ స్టార్ హీరో నాగ చైతన్య మొదట టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంతను ప్రేమించి, పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నాడు. కానీ వీరి మధ్య మనస్పర్థలు రావడంతో వివాహం జరిగిన మూడు సంవత్సరాలకే వీరు విడాకులు తీసుకొని విడిపోయారు. తర్వాత చైతూ, శోభితను ప్రేమించి, రెండో వివాహం చేసుకున్నాడు.

2 / 5
పవర్ స్టార్, పవన్ కళ్యాణ్ : ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ హీరో మొదట రేణు దేశాయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, తర్వాత వీరు మనస్పర్థల కారణంగా విడిపోయారు. తర్వాత పవన్ కళ్యాణ్, రష్యన్ మోడల్ అన్నా లెజ్నెవాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

3 / 5
అక్కినేని నాగార్జున : అక్కినేని నాగార్జున మొదట దగ్గుబాటి లక్ష్మిని వివాహం చేసుకున్నాడు. కానీ వీరి వివాహ బంధం ఎక్కువ కాలం కొనసాగలేక పోయింది. వీరు నాగ చైతన్యకు జన్మనిచ్చిన తర్వాత పలు కారణాలతో విడాకులు తీసుకొని విడిపోయారు. తర్వాత నాగార్జున నటి అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

4 / 5
ప్రకాష్ రాజ్ : నటుడు ప్రకాష్ రాజ్ ముందుగా లలిత కుమారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తర్వాత వీరు మనస్పర్థల కారణంగా విడిపోగా, తర్వాత పోనీ వర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, వీరికి ఒక బాబు.

5 / 5
మంచు మనోజ్ : టాలీవుడ్ హీరో మంచు మనోజ్ తెలియని వారు ఉండరు. మోహన్ బాబు వారసుడిగా ఈయన ఇండస్ట్రీలో తన హవా కొనసాగిస్తున్నాడు. అయితే మనోజ్ మొదట ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకొని ,కొన్ని రోజులకే విడాకులు తీసుకొని విడిపోయారు. తర్వాత ఈ హీరో భూమా మౌనికను ప్రేమించి రెండో పెళ్లి చేసుకున్నాడు.