
టాలీవుడ్‌లో స్టార్ యాంకర్ స్రవంతి చొక్కారపు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన ముద్దు ముద్దు మాటలతో మైమరిపించే ఈ ముద్దుగుమ్మకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ముఖ్యంగా సోషల్ మీడియాలో స్రవంతికి మంచి క్రేజ్ ఉంది. ఆమె షేర్ చేసే ఫొటోలు, వీడియోలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంటుంది.

గతంలో బిగ్ బాస్ తెలుగు రియాలిటీ టీషోలో కంటెస్టెంట్ గా పాల్గొంది స్రవంతి. విజేతగా నిలవపోయినా తన అందం, ఆట తీరుతో బుల్లితెర ఆడియెన్స్ మనసులు గెల్చుకుంది.

ప్రస్తుతం టీవీ షోస్, ప్రోగ్రామ్స్ తో పాటు ఎక్కువగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లలో ఎక్కువగా కనిపిస్తోందీ అందాల తార. ఆ మధ్యన ప్రేమలేఖ అనే ఓ సినిమాలోనూ నటించింది స్రవంతి.

ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ లో కొన్ని ఫొటోలు షేర్ చేసింది స్రవంతి. అందులో హాఫ్ శారీ ధరించిన ఆమె అచ్చమైన పదహారణాల తెలుగమ్మాయిలా ఎంతో అందంగా కనిపించింది.

ప్రస్తుతం యాంకర్ స్రవంతి చొక్కారపు షేర్ చేసిన హాఫ్ శారీ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.