Cinema : చనిపోయిన అమ్మాయిని వేధించే కుర్రాడు.. ప్రతి 20 నిమిషాలకు ఊహించని మలుపులు.. ఓటీటీని శాసిస్తున్న సినిమా..

Updated on: Aug 11, 2026 | 1:58 PM

సస్పెన్స్ థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ చిత్రాలు చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. ఈమధ్య కాలలో ఓటీటీలో ఇలాంటి జానర్ చిత్రాలు తెగ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న ఒక సినిమా ఓటీటీలో దుమ్మురేపుతుంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై ఇప్పుడు డిజిటల్ ప్రపంచాన్ని శాసిస్తుంది. ఇంతకీ ఆ సినిమా కథేంటీ అని ఆలోచిస్తున్నారా... ?

1 / 5
ఒక గ్రామంలో, ప్రధానంగా 40 నుండి 50 ఏళ్ల మధ్య వయసున్న వారు దారుణంగా హత్య చేయబడతారు. తన ప్రతిష్టను కాపాడుకోవాలనుకునే ఒక పోలీస్ అధికారి ఈ నేరాలను దర్యాప్తు చేస్తాడు. ఒక చిన్న గ్రామంలో జరిగే రహస్యమైన , భయంకరమైన హత్యల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ఈ నేరాలపై దర్యాప్తు చేస్తుండగా, అతనికి ఒక వింత ఫిర్యాదు అందుతుంది. ఒక మధ్య వయస్కుడు పోలీసుల వద్దకు వచ్చి, తన కుమార్తెను ఒక అబ్బాయి వేధిస్తున్నాడని ఫిర్యాదు చేస్తాడు.

2 / 5
అయితే ఇక్కడ దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే, ఆ అమ్మాయి మూడు నెలల క్రితం ఆత్మహత్య చేసుకుంటుంది. చనిపోయిన అమ్మాయిని ఎవరు, ఎలా హింసిస్తున్నారు? దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్న క్రమంలో, కథ ప్రతి 20 నిమిషాలకు కొత్త, ఊహించని మలుపులు తీసుకుంటుంది. అంటే, ఈ సినిమా ప్రతి 20 నిమిషాలకు మన ముందు ఏదో ఒక కొత్త విషయాన్ని ఉంచుతుందన్నమాట.

3 / 5
ఈ సినిమా ఆద్యంతం ఉత్కంఠ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ముగింపు మీరు ఊహించలేని విధంగా ఉంటుంది. సినిమా ముగింపు చాలా దిగ్భ్రాంతికరంగా, ఆలోచింపజేసేలా ఉంటుంది. ప్రముఖ కన్నడ నటుడు విజయ్ రాఘవేంద్ర ఈ చిత్రంలో ఒక పోలీస్ అధికారి ప్రధాన పాత్రలో నటించారు. వాస్తవానికి కన్నడలో రూపొందిన ఈ చిత్రం తమిళ, హిందీ భాషలలో అందుబాటులో ఉంది. ఓటీటీలో విడుదలైన తర్వాత ఈ చిత్రం చాలా కాలం పాటు టాప్ 3 , టాప్ 10 లో నిలిచింది.

4 / 5
మనం మాట్లాడుకుంటున్న ఈ సినిమా పేరు 'సెకండ్ కేస్ ఆఫ్ సీతారాం'. దీనిని అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడవచ్చు. ఇది 2026లో విడుదలైన ఒక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా.  దేవీ ప్రసాద్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వర్సటైల్ యాక్టర్ విజయ్ రాఘవేంద్ర ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ సీతారాంగా మరోసారి తన నటనతో మెప్పించారు. ఫ్లయింగ్ ఎలిఫెంట్ స్టోరీ టెల్లర్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా, క్రైమ్ థ్రిల్లర్ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాకు అతిపెద్ద బలం దాని కథనం (Screenplay).

5 / 5
 దర్శకుడు దేవీ ప్రసాద్ శెట్టి అనవసరమైన సన్నివేశాలకు తావులేకుండా, కథను మొదటి నుండి చివరి వరకు చాలా వేగంగా, ఆసక్తికరంగా నడిపించారు. విజయ్ రాఘవేంద్ర తన సీరియస్ లుక్స్, బాడీ లాంగ్వేజ్‌తో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా పరిపూర్ణమైన నటనను కనబరిచారు. సాంకేతిక విభాగంలో నవనీత్ శ్యామ్ అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాలలోని ఉత్కంఠను రెట్టింపు చేస్తుంది. సస్పెన్స్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ , క్రైమ్ థ్రిల్లర్ జోనర్లను ఆస్వాదించే ప్రతి ఒక్కరికీ ‘సెకండ్ కేస్ ఆఫ్ సీతారాం’ ఒక మంచి వీక్షణ అనుభూతిని అందిస్తుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us