Tollywood News: బీ టౌన్ లో టాలీవుడ్ సినిమాలు జోరు.. క్లిక్ చేస్తే మిలియన్ల కొద్దీ వ్యూస్

| Edited By: Phani CH

Jul 27, 2024 | 11:45 AM

మన హీరోలను ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో ప్రత్యేకంగా ఎవరికీ పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అందులోనూ నార్త్ బెల్ట్ లో మన హీరోలు తెలియని వారే లేరంటే నమ్ముతారా? అరే... నిజమండీ బాబూ... ఏ మాత్రం యాక్షన్‌ ఇమేజ్‌ ఉన్న కమర్షియల్‌ హీరో అయినా ఉత్తరాదిన పల్లెపల్లెకూ తెలిసిన స్టారే. యూట్యూబ్‌ల్లో యంగ్‌ హీరోల సినిమాలకు ఉన్న ఆదాయాన్ని గురించి స్పెషల్‌గా చెప్పుకోవాల్సిందే!

1 / 5

2 / 5
ఐకాన్‌ స్టార్‌ బన్నీకి దక్షిణాదిన ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో, నార్త్ క్యాంప్‌లోనూ అంతకు మించిన ఫ్యాన్‌ బేస్‌ ఉంది. అద్దిరిపోయే డ్యాన్సులు, ఇరగదీసే ఫైట్లు అక్కడి వారికి బన్నీని ఎప్పుడో ఆత్మీయుడిని చేసేశాయి. జస్ట్ డ్యాన్సులు, ఫైట్లే కాదు, ఆధ్యాత్మిక టచ్‌ ఉన్న కంటెంట్‌కి కూడా అక్కడ క్రేజ్‌ మామూలుగా ఉండదు.

3 / 5
రామ్‌ పోతినేని అప్పుడెప్పుడో నార్త్ లో చిన్న ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అయితే 'రామ్‌ భాయ్‌...' అంటూ ఫ్యాన్స్  పరిగెత్తుకుంటూ వచ్చి పలకరించారట. వీళ్లకి తానెలా తెలుసని ఆలోచిస్తే, యూట్యూబ్‌ మహిమ అని అర్థమైందట ఇస్మార్ట్ హీరోకి. సౌత్‌ రిలీజుల సంగతి ఎలా ఉన్నా, నార్త్ వాళ్లకి సినిమాలను పంపేటప్పుడు పక్కాగా అన్నీ ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా? అని చెక్‌ చేసుకోవడం అప్పటి నుంచే అలవాటైందట ఈహీరోకి. 15 - 20 కోట్ల మార్కెట్‌ ఉన్నప్పుడు ఆ మాత్రం కేరింగ్‌ ఉంటుందిగా అంటున్నారు క్రిటిక్స్.

4 / 5
ఆరడుగుల కటౌట్‌ ఉంటే, కొడ్తే అరవై మంది చుట్టూ కిందపడే జనాలుంటే... నార్త్ వాళ్ల దగ్గర సినిమా సూపర్‌ హిట్టే. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ సినిమాలు మన దగ్గర అంతగా ఆడకపోయినా, నార్త్ స్మాల్‌ స్క్రీన్స్ లో మాత్రం మిలియన్ల వ్యూస్‌ని కొల్లగొట్టేస్తున్నాయి. అందుకే బెల్లంకొండ హీరోలకు నార్త్ లో మంచి డిమాండే ఉంది.

5 / 5
మన హీరోల రేంజ్‌ని బట్టి యూట్యూబ్‌ రైట్స్ అమ్ముడవుతుంటాయి.  ఆది సాయికుమార్‌, వరుణ్‌ సందేశ్‌లాంటి హీరోల సినిమాలకు మన నిర్మాతలు ధైర్యం చేసి ఖర్చుపెట్టడానికి కారణం నార్త్ నుంచి ఏదోక రూపంలో వచ్చేస్తాయనే. ఉత్తరాదివారు కూడా పేరుకి శాటిలైట్‌ హక్కులు తీసుకుని మూవీస్‌ని విడుదల చేసి ఆ వెంటనే యూట్యూబ్‌లో మిలియన్లకొద్దీ వ్యూస్‌ రూపంలో క్యాష్‌ చేసుకుంటున్నారు. మన దగ్గర మాస్‌ ఇమేజ్‌ ఎంత ఉంటే, నార్త్ లో కాసులు అంతగా కురుస్తాయన్నమాట.