Scene Movie: బాక్సాఫీస్ కా బాప్.. థియేటర్లను షేక్ చేస్తున్న సూర్య.. సీన్ సినిమా వసూళ్ల సునామీ..

Updated on: Nov 08, 2026 | 12:52 PM

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, నజ్రియా నజీమ్ కాంబినేషన్‌లో జిత్తు మాధవన్ తెరకెక్కించిన 'సీన్' చిత్రం బాక్సాఫీస్ వద్ద విజృంభిస్తోంది. పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమా మొదటి రోజు రూ. 34.25 కోట్లు, రెండో రోజు రూ. 47.40 కోట్లతో కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 81.65 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. మూడో రోజుతోనే సునాయాసంగా రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరనుండగా, రూ. 200 కోట్ల గ్రాస్ వైపు వేగంగా అడుగులు వేస్తోంది.

1 / 5
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో, నజ్రియా నజీమ్ కథానాయికగా తెరకెక్కిన తాజా చిత్రం 'సీన్'. ఈ మూవీ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీని సృష్టిస్తోంది. నవంబర్ 6న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ ఏడాది ఇప్పటికే రెండు భారీ విజయాలను సొంతం చేసుకున్న సూర్య, ఇప్పుడు 'సీన్' చిత్రంతో హ్యాట్రిక్ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు.

2 / 5
విడుదలైన మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 40 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించిన ఈ చిత్రం, రెండో రోజైన శనివారం మరింత విజృంభించింది. రెండు రోజులు ముగిసేసరికి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 81 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను నమోదు చేసింది. తమిళనాడుతో పాటు ఆంధ్రా, తెలంగాణ, ఓవర్సీస్ మార్కెట్లలోనూ ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

3 / 5
 మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో సూర్య నటన, నజ్రియా స్క్రీన్ ప్రెజెన్స్, దర్శకుడి కథా కథనాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇటీవలే కోలీవుడ్‌లో విడుదలైన 'కరుప్పు', 'విశ్వనాథ్ అండ్ సన్స్' వంటి ప్రముఖ చిత్రాల రెండు రోజుల కలెక్షన్ రికార్డులను 'సీన్' చిత్రం అధిగమించడం విశేషం. ప్రస్తుతం ఉన్న వసూళ్ల స్పీడ్ చూస్తుంటే, మొదటి వీకెండ్ (3 రోజులు) పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ. 100 కోట్ల క్లబ్‌లో సునాయాసంగా చేరనుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

4 / 5
అంతేకాకుండా, బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ చిత్రం అతి త్వరలోనే ఆ మార్కును కూడా రీచ్ అయ్యి సూర్య కెరీర్‌లో మరో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.  ఈ చిత్రం ఒక హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ మరియు సస్పెన్స్ డ్రామాగా తెరకెక్కింది. దర్శకుడు సూర్య పాత్రను ఎంతో పవర్‌ఫుల్‌గా, భిన్నమైన షేడ్స్‌తో తీర్చిదిద్దారు. సమాజంలో జరిగే కొన్ని ఊహించని పరిణామాలు, ఒక క్రైమ్ మిస్టరీ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. సూర్య తనదైన నటనతో ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లారు.

5 / 5
ఈ సినిమాతో జిత్తు మాధవన్ ఈ చిత్రంతో తమిళంలోకి అడుగుపెట్టారు. సూర్య నటించిన ఇటీవలి చిత్రాల ఓపెనింగ్స్ రికార్డులను అధిగమించి బాక్సాఫీస్ వద్ద అత్యుత్తమ ప్రారంభాన్ని సాధించింది. 3వ రోజు (ఆదివారం) అడ్వాన్స్ బుకింగ్స్ మొదటి రెండు రోజుల కంటే ఎక్కువగా ఉన్నందున, 3 రోజులు ముగిసేసరికి ఈ సినిమా సునాయాసంగా రూ. 100 కోట్ల గ్రాస్ మైలురాయిని దాటనుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us