Movie News: అరే ఎప్పుడ్రా.. సడి చప్పుడు లేకుండా షూటింగ్ పూర్తి..

|

Oct 07, 2024 | 2:03 PM

అరే ఎప్పుడ్రా.. సోషల్ మీడియాలో ఈ మీమ్ బాగా పాపులర్. తెలుగులో కొన్ని సినిమాలకు ఈ మాట బాగా సూట్ అవుతుందిప్పుడు. అరే ఎప్పుడు పూర్తి చేసారో కూడా తెలియకుండానే సినిమాలు విడుదలకు వచ్చేస్తున్నాయి. ఆ పోస్టర్స్ వచ్చేవరకు తెలియదు అలాంటి ఓ సినిమా వస్తుందని. తాజాగా నిఖిల్ విషయంలోనూ ఇదే జరిగింది.

1 / 5
ఈ రోజుల్లో ఓపెనింగ్‌నే సినిమా రిలీజ్‌లా ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. తమ సినిమా మొదలైన విషయం ప్రపంచానికి తెలియజేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సమయంలోనూ కొందరు దర్శకులు ఏ సందడి లేకుండా షూటింగ్ పూర్తి చేస్తున్నారు. ఫస్ట్ లుక్ వచ్చే వరకు తెలియదు.. ఆ సినిమా షూటింగ్ పూర్తైనట్లు..! తాజాగా నిఖిల్ అపుడో ఇపుడో ఎపుడో విషయంలో ఇదే జరిగింది.

2 / 5
 నిఖిల్ ప్రస్తుతం స్వయంభు, ఇండియా హౌజ్ లాంటి పాన్ ఇండియన్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇలాంటి సమయంలో సౌండ్ లేకుండా నిఖిల్ ఓ సినిమా షూటింగ్ పూర్తి చేసారు. అదే అపుడో ఇపుడో ఎపుడో సినిమా. 

3 / 5
 అపుడో ఇపుడో ఎపుడో సినిమాకి సుధీర్ వర్మ దర్శకుడు. అసలు ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడో మొదలైందో కూడా తెలియదు.. సడన్‌గా దివాళి రేసులోకి వచ్చిందీ సినిమా. స్వామి రారా, కేశవ తర్వాత ఈ కాంబోలో వస్తున్న మూడో సినిమా ఇది.

4 / 5
 మొన్న మత్తు వదలరా 2 కూడా చాలా సైలెంట్‌గా షూట్ పూర్తి చేసుకుంది. ఈ చిత్ర ప్రెస్ మీట్ పెట్టేవరకు తెలియదు.. దీని సీక్వెల్ వస్తుందని. అలాగే మ్యాడ్ 2 విషయంలోనూ ఇదే జరిగింది. అసలు సందడే లేకుండా ఈ చిత్ర షూట్ పూర్తి చేసారు మేకర్స్. త్వరలోనే విడుదల కానుంది మ్యాడ్ 2.

5 / 5
మ్యాడ్ 2లోనూ నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ కంటిన్యూ అవుతున్నారు. ఇక నితిన్ తమ్ముడు అనే ఓ సినిమా చేస్తున్నారని ఎంతమందికి తెలుసు..? వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ పూర్తైంది. మంచి రిలీజ్ డేట్ కోసం చూస్తున్నారు మేకర్స్. దిల్, శ్రీనివాస కళ్యాణం తర్వాత దిల్ రాజుతో నితిన్ చేస్తున్న సినిమా ఇది.