Cinema : మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్టులు.. వణుకుపుట్టించే మైథలాజీ సైన్స్ థ్రిల్లర్.. 2 ఏళ్లుగా ఓటీటీని షేక్ చేస్తున్న సినిమా..

Updated on: Sep 22, 2026 | 12:52 PM

ప్రస్తుతం హారర్, సస్పెన్స్ సినిమాలతోపాటు మైథలాజీ చిత్రాలకు సైతం మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలోనే దాదాపు రెండేళ్లుగా ఓటీటీలో దుమ్మురేపుతున్న ఈ సిరీస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది. సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఈ సినిమాకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఇంతకీ ఈ సినిమా పేరు, కథేంటో తెలుసుకుందామా.

1 / 5
సాయి ధన్షిక ప్రధాన పాత్రలో నటించిన తమిళ వెబ్ సిరీస్ 'ఐంధమ్ వేధం' (Aindham Vedham). ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'జీ5' (ZEE5) వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. మైథాలజీ (పౌరాణికం) , సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ అంశాల కలబోతగా తెరకెక్కిన ఈ సిరీస్‌కు ఎల్. నాగరాజన్ దర్శకత్వం వహించారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి వచ్చిన ఈ 8 ఎపిసోడ్ల సిరీస్ దాదాపు రెండేళ్లుగా ట్రెండ్ అవుతుంది.

2 / 5
ఈ కథ కాశీ నేపథ్యంలో ప్రారంభమవుతుంది. అను ఇష్టపడకుండానే తల్లిదండ్రుల బలవంతం మీద వివాహం చేసుకున్న అనురాధ అలియాస్ అను (సాయి ధన్షిక) జీవితంలో ఊహించని మలుపులు తిరుగుతాయి. కాశీలో ఉన్న తండ్రి అంత్యక్రియల కోసం వెళ్లిన అనుకు ఒక పురాతన మైథలాజికల్ పెట్టె (బాక్స్) లభిస్తుంది. ఆ పెట్టెను తమిళనాడులోని ఓ గ్రామానికి తీసుకెళ్లి ఒక అర్చకుడికి అప్పగించాల్సి ఉంటుంది.

3 / 5
ఆ పెట్టెలో నాలుగు వేదాలతో పాటు దాగి ఉన్న రహస్యమైన 'ఐదవ వేదం' (ఐంధమ్ వేధం) ఉందనే ప్రచారం జరుగుతుంది. అసలు ఆ పెట్టె వెనుక ఉన్న రహస్యం ఏంటి? దాన్ని దక్కించుకోవడానికి ఒక పవర్ ఫుల్ పొలిటికల్ ముఠా ఎందుకు ప్రయత్నిస్తోంది? ఈ క్రమంలో అను ఎలాంటి ప్రమాదాలను ఎదుర్కొందనేది మిగతా కథ. సిరీస్ ప్రారంభం కాశీ విజువల్స్, పురాతన రహస్యాలతో ఎంతో ఆసక్తికరంగా మొదలవుతుంది.

4 / 5
 నాలుగు వేదాల గురించిన కథనాలు, మైథాలజీకి సైన్స్ ఫిక్షన్‌ను జోడించిన తీరు బాగానే ఆకట్టుకుంటుంది. అయితే కథ ముందుకు సాగే కొద్దీ కొన్ని సీన్లు నెమ్మదించడం, కొన్ని లాజిక్స్ మిస్ కావడం సిరీస్ వేగానికి అడ్డుకట్ట వేస్తాయి. క్లైమాక్స్ ఎపిసోడ్స్ వరకు ఉత్కంఠను నిలిపి ఉంచడంలో దర్శకుడు కొంతవరకు విజయం సాధించినా, ఇంకా కాస్త స్క్రీన్ ప్లేపై శ్రద్ధ పెట్టి ఉంటే అవుట్‌పుట్ మరింత అద్భుతంగా ఉండేది.

5 / 5
సాయి ధన్షిక తన పాత్రలో ఒదిగిపోయింది. అను పాత్రలోని తీవ్రతను, భయాన్ని, ధైర్యాన్ని ఆమె తన నటనతో అద్భుతంగా పండించింది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేర మెప్పించారు. సాంకేతికంగా చూస్తే సంగీతం , ఛాయాగ్రహణం (సినిమాటోగ్రఫీ) ఈ సిరీస్‌కు ప్రధాన బలం. కాశీ నేపథ్యం, గ్రామీణ వాతావరణాన్ని కెమెరాలో చూపించిన విధానం చాలా బాగుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us