Ravi Teja: చాలా రోజుల తర్వాత కనిపించిన రవితేజ కూతురు.. మోక్షద ఇప్పుడేం చేస్తుందో తెలుసా? క్యూట్ ఫొటోస్ ఇదిగో

Updated on: Oct 12, 2026 | 1:34 PM

మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా తులాభారం ఓపెనింగ్ పూజ కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి హీరో రవితేజ తో పాటు ఆయన కూతురు మోక్షద కూడా హాజరయ్యింది. సింపుల్ లుక్స్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన మోక్షద లేటెస్ట్ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి

1 / 6
 ‘ఇరుముడి’ సినిమాలో ఎట్టకేలకు హిట్‌  ట్రాక్‌ ఎక్కాడు మాస్ మహారాజా రవితేజ. శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ డివోషినల్ థ్రిల్లర్ రవితేజ కెరీర్‌కు ఓ కొత్త ఊపునిచ్చింది. ఏకంగా 200 కోట్లకు పగా కలెక్షన్లు సాధించి మాస్ మహారాజా కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

2 / 6
 'ఇరుముడి' హిట్ తో ఫుల్ జోష్ లో ఉన్న రవితేజ అదే ఊపులో కొత్త సినిమాను కూడా పట్టాలెక్కించాడు. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా, అంటే సుందరానికి వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయ రవితేజ కొత్త సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

3 / 6
 'తులాభారం' పేరుతో  తెరకెక్కుతోన్న ఈ సినిమా పూజా కార్యక్రమం ఆదివారం (అక్టోబర్‌ 11)  ఘనంగా జరిగింది. హీరో రవితేజతో పాటు హీరోయిన్లు  ప్రియాంక మోహన్, అనస్వర రాజన్ ఈ కార్యక్రమంలో సందడి చేశారు. అలాగే విలక్షణ నటుడు జేడీ చక్రవర్తి ఈ సినిమాలో విలన్ గా కనిపించనున్నారు.

4 / 6
 కాగా తులాభారం లాంఛింగ్ ఈవెంట్ లో రవితేజ కూతురు మోక్షద కూడా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రెడ్ కలర్ డ్రెస్ లో ఈ కార్యక్రమానికి వచ్చిన మోక్షద తన సింపుల్ లుక్ తో అందరి దృష్టిని ఆకర్షించింది.

5 / 6
 ప్రస్తుతం మోక్షదకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ వస్తున్నారు. ' సినిమాల్లోకి ఎప్పుడు వస్తున్నారు మేడమ్'? అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు.

6 / 6
 కాగా రవితేజ 'తులాభారం' సినిమాకు  మోక్షద లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించబోతుందని తెలుస్తుంది.  మరి చూడడానికి హీరోయిన్ కన్నా ఎక్కడా తీసిపోని ఈ అందాల భామ హీరోయిన్ గా టాలీవుడ్ లో  ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందో చూడాలి.

Loading...
Unable to load recommendations.
Follow Us