
జబర్దస్త్ లో యాంకరింగ్ చేస్తూ తన కంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది రష్మి. ఈ ముద్దుగుమ్మ అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. అంతలా తన గ్లామర్‌తో మాయ చేస్తుంది.

బుల్లితెరపై ఎన్నో షోలు చేస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ బ్యూటీ, ముఖ్యంగా సుధీర్‌తో జోడిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక జబర్దస్త్ ద్వారా ఫేమ్ సంపాదించిన చాలా మంది షోను వదిలేసి సినిమాలకే టైమ్ కేటాయించారు.

కానీ ఈ ముద్దుగుమ్మ మాత్రం జబర్దస్త్‌లో కొనసాగుతూనే సినిమాల్లో కూడా నటించింది. చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోయిన్ గా కూడా చేసి తన నటనతో మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.

ఇక ఎప్పుడూ సోషల్ మీడయాలో యాక్టివ్ గా ఉంటే ఈ చిన్నది తన లేటెస్ట్ బ్యూటిఫుల్, గ్లామర్ ఫొటోస్ షేర్ చేస్తుంటుంది. అంతే కాకుండా అభిమానులతో ముచ్చటిస్తూ, తన స్టైలిష్ ఫొటోలను షేర్ చేసి వారిని తన వైపుకు తిప్పుకుంటుంది.

తాజాగా ఈ చిన్నది ట్రెడిషనల్ లుక్ లో మెరిసిపోయింది. చూడటానికి చాలా సింపుల్ గా కనిపిస్తూ తన అందాలతో మాయ చేస్తుంది ఈ బ్యూటీ. ఈ ఫొటోలో రష్మీ అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. మరి మీరు కూడా ఈ ఫొటోస్ పై ఓ లుక్ వేయండి.