
అప్పటి వరకు నత్త నడకన సాగుతోన్న తెలుగు సినిమాకు (Tollywood) తనదైన వేగాన్ని జోడించారు, సినిమా అంటే ఇలానే తీయాలనే కట్టుబాట్ల బంధీలను బద్దలు కొట్టాడు, తెలుగు సినిమా స్థాయిని తొలిసారి జాతీయ స్థాయికి పరిచయం చేశాడు.

తనకి నచ్చిందే చేస్తా.. నచ్చనిది చేయనని చెప్పే ముక్కుసూటి తనం. నచ్చితే సినిమా చూడండి నచ్చకపోతే చూడకండి అని కుండ బద్దలు కొట్టే నైజం… ఈ ఇంట్రడక్షన్ అంతా రామ్ గోపాల్ వర్మదే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదూ.

నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీతో సావాసం చేసే వర్మ ఏది మాట్లాడినా సంచలనమే, ఏం మాట్లాడకపోయినా సంచలనమే. సమాజంలో జరిగే ప్రతీ సంఘటనపై తనదైన దృష్టిలో ఆలోచించే వర్మ ఐడియాలజీని అభిమానించే వారు ఎందరో.

ఈ తరం యువత కూడా వర్మ ఆలోచనలను అభిమానిస్తురాన్నంటే అతిశయోక్తి కాదు. వర్మను ఎంత తిట్టుకున్నా, అతను చేసే పనులు బాగా లేవని విమర్శించినా..

‘రామూయిజాన్ని’ ఎక్కడో ఒక చోట అన్వయించుకునే వారు చాలా మంది ఉన్నారు. వర్మ చెప్పిన సత్యాలు నిజమే కాదా అనే భావన కలగక మానదు.

శివ సినిమాతో మొదలైన వర్మ ప్రస్థానం సత్య, కంపెనీ, సర్కార్‌లాంటి ఎన్నో అద్భుత చిత్రాలతో బాలీవుడ్‌లోనూ కొనసాగింది.

ఇక తెలుగులో చాలా రోజుల పాటు గ్యాప్ ఇచ్చిన వర్మ మళ్లీ ‘రక్త చరిత్ర’ టాలీవుడ్ బాట పట్టాడు.

ప్రస్తుతం అత్యంత వివాదాస్పదమైన కథాంశలను ఎంచుకుంటూ సినిమాలు తెరకెక్కిస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతోన్న వర్మ పుట్టిన రోజు నేడు.

62 ఏళ్ల వయసులోకి అడుగు పెట్టినా వర్మ ఆలోచనలు మాత్రం నిత్య యవ్వనంగా ఉంటాయనడానికి ఆయన పలు సందర్భాల్లో ప్రస్తావించిన కొటేషన్లే సాక్ష్యంగా చెప్పవచ్చు.

సినిమాల పరంగానే కాదు రాజకీయాల పరంగానూ కొందరిపై సెటైర్లు వేస్తుంటాడు. ఎందుకు ఇలా చేస్తామని అడిగితే ‘నాఇష్టం’ అంటాడు.

పైగా ‘నన్ను అసలు నమ్మోద్దు.. నేను అసలు మంచి వాడిని కాదు’ అంటూ ప్రచారం చేసుకుంటాడు. ఇలా తన ప్రవర్తనతో అందరినీ ఆశ్చర్యపరిచే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.

టాలీవుడ్‌లో ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచిన ఆయన క్షణక్షణం, గాయం, మనీ, రంగీలా, దెయ్యం, అనగనగా ఒకరోజు, సత్య, కంపెనీ, సర్కార్, రక్త చరిత్ర, వీరప్పన్ తదితర సినిమాలతో సెన్సేషనల్ డైరెక్టర్‌గా మారిపోయాడు.

అయితే గతంలోలా ఇప్పుడు హిట్ సినిమాలు తీయట్లేదు వర్మ. నిజ జీవిత సంఘటలను సినిమాలుగా తెరకెక్కిస్తూ తరచూ కాంట్రవర్సీల చుట్టూ తిరుగుతున్నాడు.

ఒకవేళ సినిమాలు లేకుంటే పొలిటికల్ లీడర్లపై పడతాడు. ట్విట్టర్ వేదికగా కొందరి రాజకీయ నాయకులపై సెటైర్లు వేస్తుంటాడు.

మొత్తానికి ఏదో ఒక అంశంపై తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు వర్మ.ఈ సందర్భంగా అతని రేర్ ఫొటోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఇందులో తల్లితో దిగిన ఒక ఫొటో అందరినీ ఆకట్టుకుంటున్నాయి.