Ram Charan Birthday: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా ?..

|

Mar 27, 2023 | 4:04 PM

మెగాస్టార్ చిరంజీవి.. సురేఖ దంపతులకు 1985 మార్చి 27న జన్మించారు రామ్ చరణ్ తేజ్. 2007లో విడుదలైన చిరుత సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యాడు చరణ్.

1 / 10

2 / 10
 అయితే తొలి సినిమా నిరాశపరిచినప్పటికీ.. సెకండ్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో చరణ్ నటించిన మగధీర సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా నటనతో ప్రశంసలు అందుకున్నారు చరణ్.

3 / 10
 అయితే చిన్పప్పుడు చెర్రీకి చాలా సిగ్గు. ఇంట్లో పార్టీలున్నప్పుడు అల్లు అర్జున్, శిరీశ్ డ్యాన్స్ చేస్తుంటే.. చరణ్ చూస్తూ ఉండేవాడట. కానీ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో డాన్స్ బాగా చేసే హీరోలంటే చరణ్ పేరు ముందుంటుంది.

4 / 10
అంతేకాదు.. తండ్రి చిరంజీవితో కలిసి రాజా విక్రమార్క, లంకేశ్వరుడు, ఆపద్భాంధవుడు సినిమా  షూటింగ్ లొకేషన్లకు మాత్రమే చరణ్ వెళ్లాడట. ఇంట్లో సినిమా పోస్టర్స్ చూడటం నిషేదమట. సినీ పత్రికలు, అవార్డ్స్ వంటివి ఆఫీసుకే పరిమితం చేశారట చిరు.

5 / 10
స్కూల్ లైఫ్ వరకు చరణ్ కు సినిమాలపై అంతగా ఆసక్తి లేదట. పది పూర్తయ్యాకే కాలేజీ చదువుతున్న రోజుల్లో చెర్రీకి నటనపై ఆసక్తి ఏర్పడిందట.  అప్పటివరకు  చరణ్ సినిమాలు చూసింది కూడా తక్కువే.

6 / 10
 చెర్రీకి రానా, శర్వానంద్ బెస్ట్ ఫ్రెండ్స్. వీరు ముగ్గురు క్లాస్ మేట్స్. నాలుగో తరగతి చదివే రోజుల్లోనే చరణ్ గుర్రపు స్వారీ నేర్చుకున్నాడ. హార్స్ రైడింగ్ లో ఆయనకు చాలా ప్రావీణ్యం ఉంది.

7 / 10
 ఇక చరణ్ కు బైక్ రైడింగ్ అంటే చాలా భయమని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అంతేకాకుండా.. తనకు పెంపుడు జంతువులంటే ఇష్టమని.. స్నేహితుల పుట్టినరోజు, పెళ్లి రోజులకు వాటినే కానుకగా ఇస్తారట.

8 / 10
చరణ్ తరచూ మాలధారణలో కనిపిస్తుంటాడు. ప్రశాంతత  లభిస్తుందని.. క్రమశిక్షణ అలవడుతుందనే ఉద్ధేశ్యంతోనే దీక్ష చేపడుతుంటాడట. హీరోగానే కాదు.. నిర్మాతగానూ సక్సెస్ అయ్యారు చరణ్.

9 / 10
తన స్నేహితురాలు. అపోలో సంస్థల వ్యవస్థాపకుడు ప్రతాప్ సి.రెడ్డి మనవరాలు ఉపాసన కామినేని తో 2012 జూన్ 14న వివాహం చేసుకున్నారు. వీరిద్దరు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు.

10 / 10
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా ?..