Vijay Deverakonda : ఎంత కష్టపడ్డాడో.. స్వయంవరంలో మహరాజులా విజయ్‌.. ఫిట్నెస్ మీదే అందరి చూపు..

Updated on: Feb 28, 2026 | 6:30 PM

టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26న ఉదయ్ పూర్ లోని ఐటీసీ హోటల్లో అట్టహాసంగా జరిగింది. కేవలం సన్నిహితులు, బంధువులు, శ్రేయోభిలాషుల మధ్యలో వీరిద్దరి వివాహ వేడుక జరిగింది. ఇందుకు సంబంధించి ఫోటోస్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

1 / 5
టాలీవుడ్ స్టార్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26న వీరిద్దరి పెళ్లి రాజస్తాన్ లోని ఉదయ్ పూర్ లో ఐటీసీ మెమోంటోస్ హోటల్లో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు సన్నిహితులు, బంధువులు  హజరయ్యారు.

2 / 5
పెళ్లి అనంతరం తమ వివాహ బంధాన్ని అధికారికంగా ప్రకటిస్తూ విజయ్, రష్మిక షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ముఖ్యంగా విజయ్, రష్మిక లుక్స్ చూసి ఫిదా అవుతున్నారు నెటిజన్స్. బంగారు నగలు, దుస్తులతోపాటు అందులో విజయ్ ఫిట్నెస్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.

3 / 5
ప్రస్తుతం విజయ్ వయసు 36 సంవత్సరాలు. ఐవరీ సిల్క్ ధోతికి జతగా కుంకుమ రంగు కండువా ధరించారు. దానిపై  టెంపుల్ మోటిఫ్స్ ఎంబ్రాయిడరీ చేయడం ప్రత్యేకంగా కనిపించింది. పొడవాటి గోల్డ్ నెక్లెస్, బంగారు పోగులు, చేతులకు కడాలు, నడుముకు కమర్‌బంద్ ధరించి అచ్చం మహారాజులా కనిపించాడు.

4 / 5
అయితే విజయ్ ఫిట్నెస్ లుక్ గురించి ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు. ఒకప్పటి మహరాజులా అచ్చం భారతంలోని అర్జునుడిలా కనిపిస్తున్నాడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. తన రాయల్ ఫిట్నెస్ లుక్ కోసం విజయ్ ఎంతగా కష్టపడ్డారో అంటూ చర్చించుకుంటున్నారు.

5 / 5
ప్రస్తుతం విజయ్, రష్మిక ఇద్దరూ జంటగా రణబాలి చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలోనూ విజయ్ ఇదే ఫిట్నెస్, లుక్స్ లో కనిపించనున్నారు.  ఈ క్రమంలోనే వీరిద్దరి వివాహ వేడుక ఫోటోస్ చూసి ముగ్దులవుతున్నారు. వీరి పెళ్లి తెలుగు సంప్రదాయ మూలాలను గుర్తు చేస్తున్నారని అంటున్నారు.

Follow Us