
చైల్డ్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించి.. తమ నటనతో ప్రేక్షకులను మెప్పించిన చాలామంది నటీమణులు.. ప్రస్తుతం హీరోయిన్ లుక్‌లోకి మారిపోయి.. షాక్ ఇస్తున్నారు.

పైన కనిపిస్తున్న చిన్నారి గుర్తుందా.? ఒకప్పుడు లైఫ్ బాయ్ హ్యాండ్ వాష్ యాడ్‌లో కనిపించి మెప్పించింది. ఇప్పుడు ఈ వయ్యారి హీరోయిన్ లుక్‌లో మారిపోయి అందరూ అవాక్ అయ్యేలా చేసింది.

ఇంతకీ ఆమె మరెవరో కాదు.. ఆమె పేరు అవ్‌నీత్ కౌర్. లైఫ్ బాయ్ యాడ్‌తో.. ఈ వయ్యారి చైల్డ్ ఆర్టిస్టుగా ఉన్నప్పుడు.. మరిన్ని యాడ్స్‌లోనూ నటించింది. ఆ తర్వాత పలు సీరియల్స్, టీవీ షోల్లో నటించి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.

మర్దానీ సినిమాలో మీరా అనే పాత్రలో నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరయింది అవ్‌నీత్ కౌర్. టికు వెడ్స్ షేరు అనే సినిమాతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది.. రెగ్యులర్‌గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. అంతేకాదు అప్పుడప్పుడూ వెకేషన్ ఫోటోలు షేర్ చేస్తూ.. బికినీలో సెగలు పుట్టిస్తోంది ఈ చిన్నది.