Karuppu: తగ్గేదే లే.. 44 ఏళ్ల వయసులోనూ దిమ్మతిరిగే రెమ్యునరేషన్.. సూర్య సినిమాకు త్రిష పారితోషికం ఎంతంటే..

Updated on: May 14, 2026 | 9:49 PM

నాలుగు పదుల వయసులోనూ చేతి నిండా సినిమాలతో కుర్ర హీరోయిన్లకు చెమటలు పట్టిస్తోంది త్రిష కృష్ణన్. దాదాపు 20 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో అగ్ర కథానాయికగా చక్రం తిప్పుతున్న ఈ అమ్మడు.. అటు తమిళం, ఇటు తెలుగు ఇండస్ట్రీలలో వరుస సినిమాలతో దూసుకుపోతుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ కరుప్పు సినిమాతో అడియన్స్ ముందుకు రాబోతుంది. ఇంతకీ ఆమె ఎవరంటే..

1 / 5
చెన్నై అందం త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగిన ఈ అమ్మడు.. 'పొన్నియిన్ సెల్వన్' సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్‌ను ఘనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా ఉండటమే కాకుండా పారితోషికం విషయంలోనూ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఆమె నటిస్తున్న 'కరుప్పు' చిత్రానికి సంబంధించిన రెమ్యునరేషన్ వివరాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈ సినిమాకు అమ్మడు ఎంత పారితోషికం తీసుకుంటుంది అనే వివరాలు తెలుసుకోవడానికి నెటిజన్స్ ఆసక్తి చూపిస్తున్నారు.

2 / 5
సాధారణంగా హీరోయిన్ల కెరీర్ పదేళ్ల లోపు ముగిసిపోతుంది. కానీ త్రిష మాత్రం రెండు దశాబ్దాలు దాటినా ఇంకా టాప్ హీరోయిన్‌గానే కొనసాగుతోంది. విజయ్ సరసన 'లియో' చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న త్రిష, ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' వంటి ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, 'కరుప్పు' అనే లేడీ ఓరియంటెడ్ సినిమా కోసం త్రిష దాదాపు రూ.10 కోట్ల నుండి రూ.12 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు టాక్. ఒక హీరోయిన్ ఈ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకోవడం సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

3 / 5
కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకోవడంలో త్రిష ఎప్పుడూ ముందుంటుంది. 'కరుప్పు' చిత్రం పూర్తిగా త్రిష పాత్ర చుట్టూ తిరిగే కథ అని, ఇందులో ఆమె పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవల్‌లో ఉంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. అందుకే నిర్మాతలు సైతం ఆమె అడిగినంత పారితోషికం ఇవ్వడానికి వెనకాడటం లేదు. త్రిషకున్న బ్రాండ్ ఇమేజ్ సినిమా బిజినెస్‌కు ఎంతో ప్లస్ అవుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. త్రిష కేవలం లేడీ ఓరియంటెడ్ చిత్రాలకే కాకుండా, కమర్షియల్ సినిమాల్లోనూ తన సత్తా చాటుతోంది.

4 / 5
కరుప్పు చిత్రంలో కోలీవుడ్ సూర్య ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు ఆర్‌.జె. బాలాజీ దర్శకత్వం వహిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.ఆర్. ప్రకాష్ బాబు , ఎస్.ఆర్. ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతాన్ని అందించగా.. అడియన్స్ ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇదిలా ఉంటే.. 2004లో తెలుగులో ప్రభాస్ సరసన నటించిన వర్షం సినిమా ఆమెకు భారీ బ్రేక్ ఇచ్చింది. శైలజ పాత్రలో ఆమె నటన , ప్రభాస్‌తో ఆమె కెమిస్ట్రీ ప్రేక్షకులను కట్టుపడేశాయి.

5 / 5
ఆ తర్వాత ఏడాది నువ్వొస్తానంటే నేనొద్దంటానా మరో బ్లా్క్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో సిరి పాత్రలో త్రిష పండించిన హావభావాలు ఆమెకు ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డును తెచ్చిపెట్టాయి. ఇక మహేష్ బాబు సరసన ఆమె నటించిన అతడు చిత్రం టాలీవుడ్‌లో ఆమె స్థానాన్ని మరింత సుస్థిరం చేసింది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో దూసుకుపోతుంది. అంతేకాదు ఒక్కో సినిమాకు దాదాపు రూ.12 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటూ కుర్ర భామలకు గట్టిపోటీ ఇస్తుంది త్రిష.

Follow Us