
వీకెండ్ వచ్చేసింది. ఈ వారాంతంలో ఓటీటీలో ఏ సినిమా చూడాలా అని ప్రేక్షకులు గందరగోళానికి గురవుతారు. శనివారం, ఆదివారం వచ్చిందంటే చాలు మంచి సినిమా చూస్తూ ఎంజాయ్ చేయాలని అనుకుంటారు. కొంతమంది మాత్రం ఎక్కువగా సస్పెన్స్ చిత్రాలు చూసేందుకు ఇష్టపడుతుంటారు. అందుకే ఇప్పుడు మీ కోసం ఒక మంచి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీని తీసుకువచ్చాం. ఈ మూవీ మిమ్మల్ని చివరి క్షణం వరకు కట్టిపడేస్తుంది. ఇంతకీ ఆ సినిమా పేరెంటో తెలుసుకుందామా.

ఈ సినిమా హీరో ఒక వార్తాపత్రికలో ప్రకటనల నిపుణుడిగా పనిచేస్తాడు. క్రైమ్ రిపోర్టర్ అవ్వాలన్నది అతని కల. అతను చనిపోయిన వారి ఇళ్లకు వెళ్లి, వారి కుటుంబాల నుండి 'సంస్మరణ' ప్రకటనలను కొనుగోలు చేస్తూ పనిచేస్తాడు. అందుకోసం అతను మృతుల ఇళ్లకు వెళ్లి సమాచారాన్ని సేకరిస్తాడు. అతను వెళ్లిన ఇంట్లో ఇద్దరి మరణాలు ఒకే విధంగా జరిగాయని తెలుసుకుని దిగ్భ్రాంతికి గురవుతాడు. ఏదో తప్పు జరుగుతోందని భావించి, అతను దర్యాప్తు మొదలుపెడతాడు.

అతడు నిజం కనుక్కున్న తర్వాతే అసలు కథ మొదలవుతుంది. ఊహించని ట్విస్టులతో సాగుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మూవీ పేరు మృత్యుంజయ్. ఇది ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లోకి అందుబాటులోకి వచ్చింది. ఇందులో శ్రీవిష్ణు, రెబెకా హీరోహీరోయిన్లుగా నటించారు. క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో రూపొందిన ఈ చిత్రం, చివరికి ఏం జరుగుతుందోనన్న ఉత్సుకతను రేకెత్తిస్తుంది

సన్నివేశం నుండి సన్నివేశానికి సాగే కథనం, మిమ్మల్ని సీటు అంచున కూర్చోబెట్టే విధంగా ఉంటుంది. చివరిలో వచ్చే మలుపు ప్రేక్షకులను ఆసక్తిగా చూసేలా చేస్తుంది. అనవసరమైన సన్నివేశాలతో సమయం వృధా చేయకుండా నేరుగా కథలోకి వెళ్లడమే ఈ సినిమా బలం. హంతకుడు హీరోని చంపడానికి వెంబడిస్తాడు. అతని నుండి హీరో తప్పించుకోవడం, హత్యకు గల కారణాలు కథనం వేగాన్ని పెంచుతాయి.

ఊహించని సీన్స్, ప్రతి క్షణం ఉత్కంఠ.. ఆలోచించని మలుపులు ఆద్యంతం ఈ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. ఈ వారాంతంలో మలుపులతో నిండిన థ్రిల్లర్ చూడాలనుకునే వారికి 'మృత్యుంజయ్' ఒక మంచి ఎంపిక అని చెప్పొచ్చు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలోనూ ఈ చిత్రం అందుబాటులో ఉంది. మరీ ఇంకెందుకు ఆలస్యం ఈ సినిమాను ఈ వీకెండ్ ఇంట్లోనే చూసి ఎంజాయ్ చేయండి.